పేద ప్రజలకు శుభవార్త.. ” తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పైలట్” ప్రాజెక్టు ప్రారంభం

-

తెలంగాణ రాష్ట్ర  పేద ప్రజలకు శుభవార్త చెప్పింది కేసీఆర్ సర్కార్. ” తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పైలట్” ప్రాజెక్టును అట్టహాసంగా ఇవాళ  ప్రారంభించింది కేసీఆర్ సర్కార్. తెలంగాణ ఆరోగ్య రంగ ముఖ చిత్రాన్ని మార్చేందుకు, ఆరోగ్య తెలంగాణ సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్ ఆలోచనతో రూపొందించిన తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును ములుగు జిల్లా కలెక్టరెట్ లో ప్రారంభించిన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు.

ఇవాళ ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ తల్లినీ దర్శించుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు.. తర్వాత జిల్లా కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి భవనాన్ని కి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేసారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు.

ఆ తర్వాత ” తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పైలట్” ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా.. ములుగు, సిరిసిల్ల జిల్లాలలో 18 సంవత్సరాలు నిండిన ఏడు లక్షల మందికి పలు రకాల వైద్య పరీక్షలు చేయబోతున్నారు. ఈ పరీక్షలు అన్నీ ఉచితంగా చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.

Read more RELATED
Recommended to you

Latest news