శృంగారం ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది.. సంతోషం, ఉత్సాహాన్ని కలిగించటమే కాదు ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది..ఒత్తిడి నుంచి బయటపడే మార్గాలు అనగానే వ్యాయామం, ధ్యానం వంటివే గుర్తుకొస్తాయి. కానీ సెక్స్ వల్ల కలిగే లాభాలు చాలా మందికి తెలీవు. ఇదీ మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గటానికి తోడ్పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
చురుకైన శృంగార జీవనం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందట. గుండెకు మంచిది. శృంగారం గుండె ఆరోగ్యానికీ మేలు చేస్తుంది. వారానికి రెండుసార్లు శృంగారంలో పాల్గొనేవారితో పోలిస్తే సగటున నెలకు ఒకసారి, అంతకన్నా తక్కువగా శృంగారంలో పాల్గొనేవారికి గుండె జబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్టు నిపుణులు చెబుతున్నారు.శృంగారంలో పాల్గొన్నప్పుడు నిమిషానికి సుమారు 6 కేలరీలు ఖర్చవుతాయి.
కాస్త వేగంగా నడిచినప్పుడు ఖర్చయ్యే కేలరీలతో సమానం. శృంగారం మూలంగా తోటపని, నడక, మెట్లు ఎక్కుతున్నప్పుడు తీసుకునేంత ఆక్సిజన్ శరీరానికి లభిస్తుంది కూడా. పైగా శృంగారంతో ఉత్సాహం ఇనుమడించటం వల్ల ఇతరత్రా వ్యాయామాలు చేయటం మీదా ఆసక్తి పెరుగుతుంది..వయస్సు పైబడిన వారిలో ఈ ప్రభావం కాస్త ఎక్కువగా ఉంటుంది.
భావప్రాప్తి పొందినప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది భాగస్వాముల మధ్య ప్రేమానురాగాలను పుట్టించి, అనుబంధాలను బలోపేతం చేస్తుంది. అలాగే శృంగార సమయంలో హాయి భావన కలిగించే ఎండార్ఫిన్లు సైతం పుట్టుకొస్తాయి..ఈ రెండింటి వల్ల ఇంకాస్త త్వరగా నిద్ర పడుతుంది..
నొప్పులు, బాధల నుంచి దృష్టిని మరల్చటానికి శృంగారం మంచి సాధనం. దీంతో నొప్పులు తగ్గిన భావన కలుగుతుంది. భావప్రాప్తి పొందినప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్లు, ఇతర హార్మోన్లు తలనొప్పి, వెన్ను నొప్పి, కాళ్ల నొప్పులు తగ్గటానికీ తోడ్పడతాయి..రక్తపోటు అదుపులో ఉండే అవకాశముంది. ఎందుకంటే శృంగారం ఒకరకమైన ఏరోబిక్, కండరాలను వృద్ధి చేసే వ్యాయామాల మాదిరి ప్రభావాన్ని చూపుతుంది..అన్నిటికన్నా ముఖ్యంగా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యాన్ని ఏర్పడేలా చేస్తుంది..