Asia Cup 2022 : కోహ్లీ సెంచరీ : పాత గొడవలను తెరపైకి తెచ్చిన గంభీర్

-

ఆసియా కప్ లో భాగంగా గురు వారం ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై 101 పరుగులు తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో 61 బంధువుల్లోనే విరాట్ కోహ్లీ 122 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. దాదాపు మూడేళ్ల తర్వాత నమోదు చేసిన ఈ సెంచరీ లో 6 సిక్సర్లు మరియు 12 ఫోర్లు ఉన్నాయి. దీంతో మునుపటి కోహ్లీ గుర్తు చేశాడు.

ఈ సెంచరీ తో మూడు రికార్డులను తన పేరు లిఖిoచుకున్నాడు కోహ్లీ. అయితే.. విరాట్ కోహ్లీ సెంచరీ పై విమర్శలు చేశారు గౌతమ్ గంభీర్. తాజా సెంచరీ పై మాట్లాడుతూ విరాట్ కు టీం మేనేజ్మెంట్ అండగా ఉండడం వల్లే సెంచరీ సాధించాడని తెలిపాడు.

‘విరాట్ కోహ్లీ సెంచరీ సాధించక మూడేళ్లు అయింది. ఇది చాలా లాంగ్ టైం. ఇక్కడ నేను అతన్ని విమర్శించడం లేదు. కానీ ఈ మూడేళ్లు అతనికి చాలా మద్దతు లభించింది. దానికి కారణం గతంలో అతను పెద్ద ఎత్తున పరుగులు చేయడమే. ఒకవేళ విరాట్ కోహ్లీ స్థానంలో ఎవరైనా యువ ప్లేయర్ ఉండి మూడేళ్లుగా సెంచరీ చేయలేకపోతే జట్టులో కొనసాగే వాడని నేను అనుకోవడం లేదు. కానీ సరైన సమయంలో కోహ్లీ ఫామ్ అందుకున్నాడు. ఓపెన్ గా చెప్పాలంటే 1020 రోజులు సెంచరీ చేయలేకపోతే ఏ క్రికెటర్ కూడా ఇన్ని రోజులు జట్టు లో కొనసాగే వాడు కాదు’ అని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news