మీ భాగస్వామి మిమ్మల్ని నిజంగా నమ్ముతున్నారా?ఇలా తెలుసుకోండి..

-

ఈరోజుల్లో నిజమైన ప్రేమలో కూడా అనుమానం తాండవిస్తుంది..అయితే మీ మీద వాళ్ళకు నమ్మకం ఉందో.. లేదో ఇలా సింపుల్ గా తెలుసుకోండి..ఏ బంధంలో అయినా నమ్మకం చాలా ముఖ్యం. వివాహ బంధంలో విశ్వాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అది లేకుండా మీ బంధాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేరు. మీ కమ్యూనికేషన్ మరియు చర్యలు ఒకదానికొకటి విచ్ఛిన్నమవుతాయి..కొన్ని సూచనల ద్వారా మీ భాగస్వామి మిమ్మల్ని నిజంగా నమ్ముతున్నారో లేదో తెలుసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మీరు మీ స్నేహితులతో సమయం గడపాలనుకున్నప్పుడు మీ భాగస్వామి మీతో ఉండాలని పట్టుబట్టినట్లయితే, వారు మిమ్మల్ని నమ్మడం లేదని భావించాల్సిందే. వారు మీతో లేనప్పుడు మీరేం చేస్తున్నారో అనే ప్రశ్నలు వారిని సక్రమంగా ఉండనివ్వవు. అలా మీరు మీ ఫ్రెండ్స్ తో ఉండాలనుకున్నా, వారు మిమ్మల్ని స్వేచ్ఛగా ఉండనివ్వరు. మీరంటే నాకు నమ్మకం ఉంది, కానీ మీ ఫ్రెండ్స్ అంటే నమ్మకం లేదు అనే వాదన వినిపిస్తారు.

వారు కాల్ చేసినా, మెసేజ్ చేసినా వెంటనే రిప్లై ఇవ్వాలని అనుకుంటారు. ఒకవేళ మీరు వేరే ఏదైనా పనిలో ఉండి స్పందించకపోతే మీరేం చేస్తున్నారో అనే అనుమానం వారిలో రేకెత్తుతుంది.వెంటనే రిప్లై రాకపోతే అసహనానికి గురై పదే పదే కాల్స్ చేస్తూనే ఉంటారు..ఇది నిజంగా అన్నీ విధాల బాధిస్తుంది..

టెక్స్ట్ మెసేజీలు, ఫోన్ రికార్డింగ్ లు, ఇ-మెయిల్‌లు, లొకేషన్ డేటాను మీ భాగస్వామి తరచూ చెక్ చేస్తుంటే వారికి మీపై నమ్మకం లేదని, లేదా మీరు చెప్పేది వారు నమ్మడం లేదని నమ్మొచ్చు.మీరు అబద్దం చెబుతున్నారు అని పదే పదె ప్రశ్నలు వేసి విసిగిస్తారు..ఇవన్నీ కూడా నమ్మకం ఉందా లేదా అన్నది తెలుస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news