కాలు లేకపోయిన వ్యవసాయం .. ఎందరికో ఆదర్శం!

శారీరకంగా అన్నీ సక్రమంగా ఉన్నా, పనిచేసి బతకడానికి ఎంతో మంది బద్దకిస్తూ ఉంటారు. వారి జీవనాధారం కోసం ఇతరులపై ఆధార పడుతూ ఉంటారు. వారు స్వతహాగా బతకడానికి అసలు ప్రయత్నం చేయరు. కానీ ఇక్కడ ఒక రైతు చేస్తున్న పని ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. బద్దకంగా తల్లితండ్రుల సంపాదనపై బతికే వారు ఈ వీడియోను ఆదర్శంగా తీసుకోవాలి.

పూర్తి వివరాల్లోకి వెళితే.. సుధా రామెన్ అనే ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఓ రైతు పొలం పని చేస్తున్నట్లు ఉంది. కానీ ఆ రైతుకు ఒక కాలు లేదు. అయిన అతను ఎవరి మీద ఆధారపడకుండా తన పనులు తాను చేసుకుంటున్నాడు. సంకల్పం బలమైనది అయితే, ఎటువంటి అవిటితనం కనబడదని నిరూపించారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. పోస్టు చేసిన కొద్ది సమయంలోనే, లక్షలాది మంది నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ఇతనిని ఒక ఆదర్శ రైతుగా భావించాలని కొందరు ప్రశంసల వర్షం కురిపించారు. ఇతను ఎంతో మందికి స్పూర్తి కలిగిస్తున్నాడు అంటూ మరికొందరు కితాబిచ్చారు.

ఈ వీడియో చూసిన మరికొందరు ఇక్కడ ఒక హీరో ఉన్నాడు అంటూ అభినందించారు. ఇతని నుంచే మనం ఎంతో నేర్చుకోవలసి అవసరం ఉంది. అయితే ఈ వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరు? అతను ఏ ప్రాంతానికి చెందిన వారు? ఇలాంటి వివరాలు ఏమీ తెలియడం లేదు. అయినప్పటికీ ఈ ఆదర్శ రైతు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.