భార్యాభర్తలు ఈ మూడు విషయాలను గుర్తుపెట్టుకుంటే అస్సలు గొడవలు ఉండవు ..!!

-

భార్యాభర్తల మధ్య గిల్లికజ్జాలు ఎలా ఉంటాయో గొడవలు కూడా అలానే ఉంటాయి..ఎంతో అన్యోన్యంగా ఉండే భార్యాభర్తల మధ్య ఏదో ఒక విషయంలో చిన్నపాటి మనస్పర్ధలు తలెత్తుతూ ఉంటాయి అయితే ఇలాంటి మనస్పర్ధలు తలెత్తినప్పుడు ఎవరో ఒకరు ఒక అడుగు ముందుకు వేసి ఈ సమస్యను అంతటితో పరిష్కరించడానికి కృషి చేయాలి కానీ ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటూ ఆ చిన్న సమస్యను కాస్త సాగదీస్తూ పోతే సమస్య మరింత పెద్దది అవుతుంది..అందుకే ఈ మూడు విషయాలను గుర్తుపెట్టుకుంటే అస్సలు గొడవలే రావని నిపుణులు అంటున్నారు అవేంటో ఒకసారి చూద్దాం..

 

క్షమాపణలు:

సమస్య చిన్నదైనా పెద్దదైన ఆ సమస్యను మరింత లాగకుండా భార్య లేదా భర్త ఇతరులు ఎవరో ఒకరు చేసిన తప్పుకు క్షమాపణలు చెబితే ఆ సమస్య అక్కడితో ముగుస్తుంది..

మార్పు తప్పనిసరి:

భార్యాభర్తల జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత కొన్ని సార్లు మనం పరిస్థితులకు అనుగుణంగా మన ఆలోచన ధోరణి మన వ్యవహార శైలిని మార్చుకోవాలి. అంతేకాకుండా నేను ఇలాగే ఉంటాను అని మొండిగా ఉంటే సమస్యలు తప్పక వస్తాయి..అందుకే మార్పు అనేది జీవితాన్ని నిలబెడుతుంది..

లోపాలు వెతక కూడదు:

తప్పు అనేది మనకు తెలిసే తెలియకుండా జరగడం సర్వసాధారణం తప్పులు చేయని మనిషి ఉండరు. అయితే ఎప్పుడూ కూడా మనం చేసిన తప్పును లేదా మనలో లోపాలను వెతుకు కూడదు. ఇలా లోపాలను వెతుకుతూ ఉంటే ఇద్దరి మధ్య సమస్య ఎప్పటికీ తీరదు అందుకే ఈ విషయాల కనుక భార్యాభర్తలు గుర్తుంచుకుంటే వారి జీవితంలో గొడవలు అనేవి ఉండవు.. జీవితం సాఫీగా సాగుతుంది..నువ్వు నేను మనం అని ఉంటే ఎటువంటి గొడవలు రావు..ఇది మన జీవితం.. అది మర్చిపోకూడదు..

Read more RELATED
Recommended to you

Latest news