మెరిసే జుట్టు కోసం కుంకుడు కాయ!

అందమైన పొడవాటి నల్లని జుట్టు ఉండాలని ఎవరికైనా ఆశ ఉంటుంది. మరి అలాంటి అందమైన జుట్టు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ కాలం ఆడపిల్లలు. పూర్వం మన పెద్దవాళ్ళు కుంకుడు కాయలతో తలంటు స్నానం చేసేవారు. అందుకనే ఎలాంటి జుట్టు సమస్యలు ఉండేవి కాదు. కానీ ప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవితంతో మార్కెట్లో దొరికే వివిధ రకాల షాంపూలు వాడటం వల్ల అనేకమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుంకుడు కాయలను వాడడం వల్ల కలిగే ఫలితం ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం.

కుంకుడుకాయలో ఉండే విటమిన్ ‘ఎ’, ‘డి’ వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇవి జుట్టు కుదుళ్లను బాగా బలంగా ఉంచి ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి. ఈ విటమిన్స్ కొత్త ఫాలికల్స్ ను పెరిగేలా చేస్తుంది.

కుంకుడుకాయ రసం నాచురల్ షాంపూ గా పనిచేస్తుంది. దాంతో జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా, నల్లగా మెరుస్తూ ఉంటుంది. కుంకుడుకాయలో ఉండే విటమిన్స్ వల్ల జుట్టు సిల్కీ ఇంకా స్మూత్ గా తయారవుతుంది.

స్కాల్ప్ మీద ఏర్పడే ఫంగస్ చుండ్రు వంటి సమస్యలతో, జుట్టు పెరగక పోవడం లేదా జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు చాలామందిలో తలెత్తుతుంటాయి. కుంకుడు కాయలతో తలస్నానం చేయడం ద్వారా అందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఇటువంటి సమస్యలను దూరం చేస్తాయి.

కొద్దిగా కుంకుడు కాయల పొడి, శీకాయ పొడి మిశ్రమాన్ని బాగా కలిపి మెత్తగా పేస్ట్ లా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్, జుట్టు కుదుళ్లకు అంటుకునే విధంగా పెట్టాలి. ఒక అరగంట ఆగి తలస్నానం చేయడం ద్వారా తెల్ల జుట్టు రాకుండా, జుట్టు కుదుళ్లు బలంగా మారి జుట్టు రాలే సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది.

కుంకుడు కాయలు పెంకు తీసి రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం వడగట్టి షాంపూలా జుట్టు మొత్తం అంటించాలి. ఇది జుట్టుకు మంచి కండిషనర్ గా పనిచేస్తుంది

చూశారుగా ఎన్ని లాభాలో.. మరి ఇంకేందుకు ఆలస్యం ఈ చిట్కాలు పాటించి మీ జుట్టును అందంగా ఆరోగ్యంగా తయారు చేసుకోండి.