షాకింగ్: నెల్లూరు నగర టీడీపీ అధ్యక్షుడిపై వేటు

ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు వేగంగా మార్పు చెందుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లా రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. కాగా తాజాగా టీడీపీ అధిష్ఠానము తీసుకున్న నిర్ణయంతో చంద్రబాబు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే సీటును గెలుచుకోవడానికి ఎన్నో వ్యూహాలను అమలు చేస్తున్నారు. ప్రస్తుతం నెల్లూర్ నగర టీడీపీ అధ్యక్షుడిని మారుస్తున్నారు.

కాగా ఇపుడు అధ్యక్షుడిగా ఉన్న టీడీపీ సీనియర్ నాయకుడు ధర్మవరం సుబ్బారావు పై వేటు వేసినట్లుగా తెలుస్తోంది. అతని స్థానంలో 4 వ డివిజన్ కార్పొరేటర్ గా పనిచేసిన అనుభవం ఉన్న మామిడాల మధును కొత్త అధ్యక్షుడిగా ప్రకటించనున్నారు.