సీఎం కేసీఆర్ తో జేసీ దివాకర్ రెడ్డి భేటీ

-

ఇవాళ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కి వచ్చారు టీడీపీ సీనియర్‌ నేత జేసీ దివాకర్‌ రెడ్డి. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కెసిఆర్ మరియు ఆయన తనయుడు మంత్రి కేటీఆర్‌ తో జెసి దివాకర్‌ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం మీడియాతో జేసీ దివాకర్‌ రెడ్డి మాట్లాడారు.

సీఎం కెసిఆర్ ను…. తెలంగాణ సీఎం హోదా లో కలవలేదని… కేవలం మర్యాద పూర్వకంగా కలిశానని పేర్కొన్నారు. రాజకీయ చర్చ సమావేశం లో జరుగలేదని… అలాంటి అవసరాలు కూడా తనకు లేవని తేల్చి చెప్పారు. మమ్మల్ని కలుపుకుని పోక పోవడం తప్పు అని సీఎం కేసీఆర్‌ కు చెప్పానని పేర్కొన్న జేసీ దివాకర్‌ రెడ్డి… పరిస్థితులు అలా ఉంటాయని కెసిఆర్ అన్నారని వివరించారు.

అంతకు ముందు సిఎల్పీ లోకి వచ్చారు జెసి దివాకర్ రెడ్డి. జానారెడ్డి గెలవడం కష్టం అని తాను ముందే చెప్పానని కాంగ్రెస్‌ నేతలకు చెప్పారు. జానారెడ్డి తనకు మంచి మిత్రుడని.. అయ్యో పాపం ఓడిపోతాడు అని బాధ తో తాను మాట్లాడుతున్నట్లు తెలిపారు. ఇక హుజురాబాద్‌ ఉప ఎన్నిక గురించి తనకు తెలియదని సింపుల్‌ గా జారు కున్నారు జేసీ దివాకర్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news