ఎమ్మెల్సీ పోరులో ట్విస్ట్‌లు..వైసీపీ-టీడీపీకి షాకులు!

-

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. ఇప్పటికే పోలింగ్ మొదలైంది..దాదాపు ఎమ్మెల్యేలు మొత్తం ఓటు హక్కు వినియోగించుకున్నారు..ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికలు సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపిస్తున్నాయి. 7 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఒక్కో ఎమ్మెల్సీ గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు కావాలి. అంటే 7 స్థానాలకు 154 ఎమ్మెల్యేల బలం ఉండాలి.

అయితే వైసీపీ అసలు బలం 151..అటు టి‌డి‌పికి 23, జనసేన 1 సభ్యుడు ఉన్నారు. అంటే వైసీపీకి 6, టి‌డి‌పికి ఒకటి గెలుచుకోవచ్చు. కానీ టి‌డి‌పికి చెందిన నలుగురు, జనసేన ఒక ఎమ్మెల్యే వైసీపీలోకి వెళ్లారు. దీంతో వైసీపీ బలం 156 అయింది..7 స్థానాలని గెలుచుకునే బలం వచ్చింది. కానీ వైసీపీకి చెందిన ఇద్దరు బయటకొచ్చారు. వారు టి‌డి‌పికి సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. దీంతో టి‌డి‌పి బలం 21 అవుతుంది. టి‌డి‌పి గెలవాలంటే ఇంకో ఎమ్మెల్యే కావాలి..అయితే వైసీపీ నుంచి మరొకరు తమకు మద్ధతు ఇస్తారని టి‌డి‌పి చూస్తుంది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారని, వైసీపీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు ఈరోజు ఆత్మ ప్రబోధానుసారం టీడీపీకి ఓట్లు వేస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వైసీపీకి షాక్ అనే విధంగా టి‌డి‌పి ఆడుతున్న మైండ్ గేమ్.

అదే సమయంలో టి‌డి‌పికి షాక్ ఇచ్చేలా గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేసిన గంటా శ్రీనివాసరావు రాజీనామాని స్పీకర్ ఆమోదించారని వైసీపీ మైండ్ గేమ్ మొదలుపెట్టింది. అయితే ఎమ్మెల్యే ఓటర్ల లిస్ట్ లో తన పేరు ఉందని, ఇదంతా వైసీపీ మైండ్ గేమ్ అని గంటా కొట్టిపారేస్తున్నారు. మొత్తానికి ఈ ఎన్నికలు ఉత్కంఠగా జరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news