డిగ్రీ విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్స్ ని అందిస్తోంది. ప్రతిభ ఉన్న ఆర్థిక పరిస్థితుల వాళ్ళు ఈ స్కాలర్ షిప్స్ ని పొందొచ్చు. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ కింద 5,000 మంది ప్రతిభ ఉన్న వాళ్లకి ఇవ్వనున్నారు. దీనితో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ స్కాలర్‌షిప్ ఉపయోగ పడుతుంది.
2023 ఫిబ్రవరి 14 లోగా దీనికి దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. రిలయన్స్ ఫౌండేషన్ అండర్‌గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్ పొందాలి అంటే కుటుంబ వార్షికాదాయం రూ.15 లక్షల లోపే ఉండాలి. అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ చదువుతూ వున్న వాళ్లు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ ని 60 శాతం మార్కులతో ప్యాస్ అయ్యి ఉండాలి. ఫుల్ టైమ్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు లో ఎన్‌రోల్ అవ్వాల్సి వుంది. అయితే ఈ స్కాలర్ షిప్ ని పొందడానికి భారతీయ విద్యార్థులు అయ్యి ఉండాలి.
https://scholarships.reliancefoundation.org/UG_Scholarship.aspx వెబ్‌సైట్‌లో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. బాలికలు, దివ్యాంగులకు ప్రాధాన్యత ఇస్తారు. రూ.2 లక్షల వరకు స్కాలర్‌షిప్ వస్తుంది. ఏదైనా స్ట్రీమ్‌లో డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం.