విశాఖ జిల్లా గాజువాకలో చంద్రబాబు సభలో రాళ్లు కలకలం రేపాయి. ఆయన ప్రసంగిస్తుండగా ప్రజాగళం వాహనం వెనుక నుంచి ఓ ఆగంతకుడు రాయి విసిరి పరారయ్యాడు. ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఫైరయ్యారు.’నిన్న సీఎంపైన చీకట్లో గులకరాయి పడింది. ఇప్పుడు నాపై కరెంట్ ఉన్నప్పుడే రాయి పడింది. తెనాలిలోనూ పవన్పై రాళ్లు వేశారు. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ రాళ్లు వేస్తోంది. పోలీసులు ఏం చేస్తున్నారు?’ అని ఆయన మండిపడ్డారు.
ఈ రాళ్లు వేసే ఘటనలు మంచిది కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘సీఎం సభలో కరెంట్ బంద్ చేసిన, రాళ్లు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. పోలీసులు, ఇంటెలిజెన్స్ సిబ్బంది ఏం చేస్తున్నారు? ఎవరిపై అయినా రాళ్లు వేయడం మంచి పద్ధతి కాదు అని అన్నారు. దాడులు చేస్తే.. చూస్తూ ఉండటానికే పోలీసులు ఉన్నారా? సీఎం సభలో కరెంట్ పోతే ఎవరు బాధ్యత వహించాలి?’ అని చంద్రబాబు ప్రశ్నించారు.