పాదాల కండరాల్లో నొప్పిగా ఉందా.? కారణాలు, చిట్కాలు ఇవే..!!

-

కండరాల నొప్పి అనేది వయసుతో సంబంధం లేకుండా వచ్చే సమస్య..అయితే ఇది అంత ప్రమాదమైనది కానప్పటికీ..చాలా ఇబ్బంది పెడుతుంది. వ్యాయామాలు చేసిన మొదటిరోజు సాయంత్రం నుంచి ఉంటుంది..కుర్చోలేరు, నడవలేరు, లేవలేరు. సాధారణంగా ఈ నొప్పి నిద్రలో పోతుంది. కాళ్ల కండరాలు బలహీనపడటం వల్ల పాదాలపై నిలబడటం కష్టమవుతుంది. కాలి కండరాల బెణుకును తొలగించడానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి.. ఇవి పాటిస్తే వెంటనే ఉపశమనం పొందవచ్చు…Sudden Knee Pain: Possible Causes, Symptoms, and Treatment - Parade:  Entertainment, Recipes, Health, Life, Holidays

కాలి కండరాలలో నొప్పికి కారణాలు..

విటమిన్ డి, థైరాయిడ్ సమస్య, శరీరంలో ఉప్పు, నీరు లేకపోవడం,స్టెరాయిడ్స్ అధికంగా తీసుకోవడం కండరాల నొప్పికి కారణమవుతుంది.
చేతులు, కాళ్ళలో నొప్పి, బలహీనత కూడా ఇందుకు కారణం.

కండరాల నొప్పికి చిట్కాలు..

పాదాల కండరాలలో నొప్పితో బాధపడుతున్నట్లయితే.. ఐస్ క్యూబ్‌ను అప్లై చేయొచ్చు.. తద్వారా కండరాల లోపల నొప్పి, వాపు తగ్గిపోతుంది. ఇలా చేయడం ద్వారా వెంటనే ఉపశమనం లభిస్తుంది. కండరాలపై 15-20 నిమిషాల పాటు ఐస్‌ను అప్లై చేస్తూ మసాజ్ చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

వ్యాయామం..

కండరాల నొప్పి, వాపును తొలగించాలనుకుంటే వ్యాయామం చేయండి. వ్యాయామం చేయడం వల్ల కండరాల దృఢత్వం తొలగిపోతుంది. వ్యాయామం చేయడం వల్ల కాళ్లలో మొదలైన నొప్పి నెమ్మదిగా తగ్గుతుంది. వ్యాయామం చేయడం వల్ల వచ్చే కండరాల నొప్పులు మళ్లీ మరుసటి రోజు వ్యాయామం చేయడంతోనే పోతాయి.. పడుకునే విధానం కూడా కాళ్లలో నొప్పిని కలిగిస్తుంది. మీ పాదాల క్రింద ఒక దిండుతో పడుకోండి.

ఆహారంలో అల్లం..

కండరాల నొప్పితో బాధపడేవారు ఆహారంలో అల్లం తీసుకోవాలి. ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇది కండరాల తిమ్మిరి, నొప్పి, దృఢత్వాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

మస్టర్డ్ ఆయిల్‌తో మసాజ్:

ఆవనూనెతో రోజూ కాలి కండరాలకు మసాజ్ చేయడం వల్ల నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. మస్టర్డ్ ఆయిల్ పాదాల నొప్పిని తగ్గిస్తుంది. మసాజ్ చేయడం వల్ల కండరాలు బలపడతాయి. కండరాల ఒత్తిడి తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news