కొంపముంచిన పానీపూరి.. ఆసుపత్రి పాలైన 100 మంది

-

పానీపూరి అంటే ఇష్టపడని వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. అదేంటో దాని గురించి ఎన్ని సార్లు నెగిటివ్‌ వార్తలు విన్నా.. ఆ పానీపూరి బండి చూడగానే మనసంతా అటే లాగేస్తుంది. ఇప్పుడు జరిగిన ఓ ఘటన పానీపూరి లవర్స్‌కు కాస్త షాకింగ్ విషయమే. ఏకంగా పానీపూరి తిని వంద మంది ఆసుపత్రి పాలయ్యారట.పశ్చిమబెంగాల్‌లో జరిగిన ఈ వార్త పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…

పశ్చిమ బెంగాల్‌ హుగ్లీ జిల్లాలోని సుగంధ గ్రామ పంచాయతీలోని డోగాచియా ప్రాంతంలోని ఒక వీధిలో పానీపూరి దుకాణం ఉంది. అందులో..
ఎప్పటిలాగానే స్థానికులు కొంత మంది పానీపూరీ తిన్నారు. అయితే.. తిన్న కాసేపటికే వారంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంట వెంటనే వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. బాధితులను టెస్ట్ చేసిన వైద్యులు ఫుడ్ పాయిజనింగ్ తోనే ఇలా జరిగిందని అన్నారు.

బాధితులందరికి ప్రత్యేక వార్డులలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ప్రత్యేక బృందం సంఘటనా స్థలానికి చేరుకుని రోగులను పరిశీలించి మందులు ఇచ్చారు. వారు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో.. ఎక్కువ మంది జబ్బుపడిన వారిని ఆసుపత్రులలో చేరినట్లు తెలుస్తోంది. అదే విధంగా అస్వస్థతకు గురైన వారు.. డోగాచియా, బహిర్ రణగాచా, మకల్తలా నివాసితులుగా డాక్టర్లు గుర్తించారు.

మొత్తంగా వందమంది వరకూ పానీపూరి వల్ల ఆసుపత్రి పాలయ్యారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయి. మీకు అంతగా పానీపూరి తినాలంటే.. ఇంట్లోనే స్వయంగా చేసుకోని తినొచ్చు. ఇలా ఎక్కడపడితే అక్కడ హైజెనిక్‌ లేని ప్రదేశాల్లో పానీ పూరి తినడం వల్ల లేనిపోని రోగాలు వస్తాయి. అసలే వర్షాలు.. సీజనల్‌ వ్యాధులు.. వాటికి తోడు ఇలా రోడ్డుపక్కన ఉండేవి తింటే రోగాలను కొనుక్కోని మరీ తెచ్చుకున్నట్లే అవుతుంది. కొంతమంది మాత్రమే పానీపూరీ అంటే ఇష్టమున్నా బయట చేసేవి తినరు. ఆరోగ్యం మీద మీకు కూడా శ్రద్ధ ఉంటే ఇలా బయటవి తినడం కాస్త తగ్గించడం ఉత్తమం ఉంటున్నారు వైద్యులు.

Read more RELATED
Recommended to you

Latest news