ఫిబ్రవరిలో 12 రోజులు బ్యాంకులకి​ సెలవులు..!

-

మనకి ఏదో ఒక బ్యాంక్ పని ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు అయితే చాలా ముఖ్యమైన పనులు ఉంటాయి. వాటిని పూర్తి చేసుకోవాలని మనం అనుకుంటాం. అయితే ఒకవేళ కనుక ఆరోజు బ్యాంక్ సెలవు అయితే ఆ బ్యాంక్ పని అవ్వదు. అందుకోసమే బ్యాంకులు ఏ రోజు పని చేస్తున్నాయి, ఏ రోజు సెలవు అనేది తెలుసుకోవాలి.

bank-holidays

ఈ ఏడాది ఫిబ్రవరి బ్యాంక్​ సెలవుల జాబితా వచ్చింది. మొత్తంగా 12 బ్యాంక్ సెలవులు ఫిబ్రవరి నెలలో వున్నాయి. అయితే మరి ఏయే రోజులు సెలవొ చూసుకుని మీ పనులని పూర్తి చేసుకోండి. ఇక సెలవుల వివరాల లోకి వెళితే..

ఫిబ్రవరి 2: సోనమ్ లోచర్​ (గ్యాంగ్​టాక్​లో మాత్రమే బ్యాంకులు సెలవు)
ఫిబ్రవరి 5: సరస్వతి పూజా, శ్రీ పంచమి, వసంత పంచమి (కోల్​కతా, భువనేశ్వర్​, అగర్తలలో సెలవు)
ఫిబ్రవరి 6: ఆదివారం
ఫిబ్రవరి 12: రెండో శనివారం
ఫిబ్రవరి 13: ఆదివారం
ఫిబ్రవరి 15: మహమ్మద్ హజ్రత్ అలీ జయంతి, లుయిస్​-నాగాయ్​-ని (ఇంపాల్​, కాన్​పూర్​, లక్నోల్లో సెలవు)
ఫిబ్రవరి 16: గురు రవిదాస్​ జయంతి (చంఢీగడ్​లో బ్యాంకులు ఆరోజు పని చేయవు)
ఫిబ్రవరి 18: దోల్​జాత్రా​ (కోల్​కతాలో సెలవు)
ఫిబ్రవరి 19: ఛత్రపతి శివాజీ మహారాజ్​ జయంతి (మహారాష్ట్ర లో బ్యాంకులకు సెలవు)
ఫిబ్రవరి 20: ఆదివారం
ఫిబ్రవరి 26: నాలుగో శనివారం
ఫిబ్రవరి 27: ఆదివారం

Read more RELATED
Recommended to you

Latest news