RGV : “భీమ్లానాయక్‌”కు అంత సీన్ లేదా…పవన్ కళ్యాణ్ పై RGV సంచలన వ్యాఖ్యలు !

-

పవన్‌ కళ్యాణ్‌ తాజాగా నటించిన చిత్రం భీమ్లా నాయక్‌. ఈ సినిమా కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. అయితే.. ఈ సినిమా విడుదలపై వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుష్ప యే అంత చేస్తే పవర్ స్టార్ పవన్‌ కళ్యాన్‌ అయిన మీరు నటించిన భీమ్లా నాయక్ ఇంకా ఎంత కలెక్ట్ చెయ్యాలి? ..పాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ చెయ్యకపోతే మీ ఫ్యాన్స్ అయిన మేమంతా బన్నీ ఫ్యాన్స్ కి ఆన్సర్ చెయ్యలేమంటూ సంచలన ట్వీట్‌ చేశారు వర్మ.

“ఎప్పుడో మీ తర్వాత వచ్చిన పిల్లలు ఎన్టీఆర్‌,రాంచరణ్‌ కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోతూ ఉంటే, మీరు ఇంకా ఒట్టి తెలుగు ని పట్టుకుని వేలాడటం మీ ఫ్యాన్స్ అయిన మాకు కన్నీటి ప్రాయంగా ఉంది.దయచేసి భీమ్లా నాయక్ ని పాన్ ఇండియా తీసుకెళ్ళి మీరే సబ్కా బాప్ అని ప్రూవ్ చెయ్యండి” అంటూ మరో ట్వీట్‌ లోపేర్కొన్నారు. ఇంటీరియర్ ఆంధ్ర లో జరిగిన పుష్ప సబ్జెక్ట్ పాన్ ఇండియా సబ్జెక్ట్ అయినప్పుడు, కొమరం భీమ్, అల్లూరి లాంటి తెలుగు వీరుల సబ్జెక్ట్ పాన్ ఇండియా అయినప్పుడు, భీమ్లా నాయక్ సబ్జెక్ట్ పాన్ వరల్డ్ సబ్జెక్ట్ కాదంటారా పవన్‌ కళ్యాణ్‌ గారూ??? అంటూ ప్రశ్నించారు రామ్‌ గోపాల్‌ వర్మ. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news