పన్నెండేళ్ల వైసీపీ : ష‌ర్మిల హిట్ జ‌గ‌న్ ఫ‌ట్

-

తెలంగాణలో జ‌గ‌న్ త‌న పార్టీని పూర్తిగా క్లోజ్ చేసి ఆంధ్రాలో మాత్రమే త‌న వ్య‌వ‌హారాల‌ను స్థిరం చేస్తున్నారు.ఇదే స‌మ‌యంలో ఆయ‌న చెల్లాయి ష‌ర్మిల మాత్రం తెగువ చేసి వైఎస్సార్టీపీ అంటూ కొత్త పార్టీ ఒక‌టి అనౌన్స్  చేసి తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతూ త‌న పంథాను కొన‌సాగిస్తున్నారు.ఓ విధంగా అన్న క‌న్నా చెల్లే కొంత ధైర్యం చేసి త‌న స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌డం ఓ విధంగా మంచి ప‌రిణామ‌మే! ఆమె గెలిచినా గెల‌వ‌కున్నా త‌న పోరాట ప‌టిమ‌ను మాత్రం కొన‌సాగించే ప్ర‌క్రియ‌ను మాత్రం ఆప‌రు అని మాత్రం ఇప్ప‌టికే తేలిపోయింది.ఆ విధంగా  ష‌ర్మిల క‌న్నా జ‌గ‌న్ వెనుకంజ‌లో ఉన్నారు.

ఓ విధంగా జ‌గ‌న్ ఎప్పుడో తెలంగాణ‌లో త‌న‌కు ప‌ట్టున్న ప్రాంతాల‌న్నింటిలో పార్టీ కార్య‌క‌లాపాలు నిలిపివేయ‌డం నిజంగానే విచార‌క‌రం.దీంతో వైఎస్సార్ వెంట ఆరోజు న‌డిచిన అభిమానులు మ‌రియు జ‌గ‌న్ వెంట న‌డిచిన కార్య‌క‌ర్త‌లు దిక్కుతోచ‌క కొందరు గులాబీ గూటికి చేరిపోయారు.ఈ నేప‌థ్యంలోఇవాళ 12వ వార్షికోత్స‌వాన్ని వైసీపీ జ‌రుపుకుంటున్న నేప‌థ్యంలో అన్న‌య్య జ‌గ‌న్ క‌న్నా చెల్లాయి ష‌ర్మిలే ఎంతో కొంత బెట‌ర్ అన్న‌ది తేలిపోయింది.ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో..మ‌న‌లోకం సైట్ ప్రత్యేకంగా అందిస్తోంది. చ‌ద‌వండిక‌…

దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీ పై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. సీఎం జగన్ జైలులో ఉన్న సమయంలో షర్మిల అనే ముందుండి వైసిపిని నడిపించారు. పాదయాత్రలో జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ప్రజల్లోకి తీసుకు వెళ్లారు. వైసీపీని ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. అలాంటి షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు ముందు అడుగులు వేయడంతో సహజంగానే రాజకీయ విమర్శలు అలాగే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్ర వ్యక్తులకు చెందిన పార్టీలను తెలంగాణలో ఆదరించరనే వాదనలు పలువురు టీఆర్ఎస్ పార్టీ నేతలు బలంగా వినిపిస్తున్నారు.

కానీ వైయస్ షర్మిల ఎక్కడా తగ్గకుండా… తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. నిరుద్యోగ దండోరా,రైతులకు భరోసా, పాదయాత్రలు చేస్తూ… తెలంగాణ రాష్ట్రంలో వైఎస్‌ఆర్టీపీని బలోపేతం చేస్తున్నారు. ముఖ్యంగా అధికార పక్షం టీఆర్‌ఎస్‌ ను వైఎస్‌ షర్మిల… ఎండగట్టడంలో సక్సెస్‌ అయ్యారు. 90 వేల ఉద్యోగాల ప్రకటన కూడా తన వల్లే వచ్చిందని ఇప్పుడు జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇక అటు ఏపీలో జగన్‌ మోహన్‌ రెడ్డి.. 2019 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధించారు. 150 సీట్లకు పైగా విజయం సాధించి.. ఏపీ రాజకీయాల్లోనే ప్రభంజనం సృష్టించారు. గెలుపొందడటమే కాకుండా… ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చుతున్నారు.

నవ రత్నాలు, రైతు భరోసా, ఇంకా చాలా రకాల పథకాలతో… ప్రతి కుటుంబానికి దగ్గరవుతున్నారు జగన్‌. అయితే.. ఈ నేపథ్యంలోనే.. సీఎం జగన్‌ పై అనేక విమర్శలు వస్తున్నాయి. ఖజనాలో డబ్బులు లేకున్నా.. పథకాలను అప్పులు తెచ్చి.. అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రతి పక్ష నాయకులు, మేధావులు. అటు అమరావతి రాజధానిని వదిలేసి… మూడు రాజధానుల పాట ఎత్తుకున్నారు జగన్‌ మోహన్‌ రెడ్డి. ఈ వ్యవహారం ఇప్పుడు జగన్‌ మరిన్ని తలనొప్పులను తెచ్చింది. హై కోర్టు మొట్టి కాయలు వేయడంతో… ప్రస్తుతానికి మూడు రాజధానులపై సైలెంట్ అయ్యారు జగన్‌. ఇలా జగన్‌ కు చాలా యాంగిల్స్‌ లో… వ్యతిరేకత ఎదువుతోందనేది సత్యం. మరి ఈ వ్యతిరేకతను జగన్‌ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news