కెసిఆర్ కు మహిళలంటే గౌరవం లేదు – డీకే అరుణ

-

సీఎం కేసీఆర్ కు మహిళలు అంటే గౌరవం లేదన్నారు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. మంత్రుల కుటుంబ సభ్యులు క్రిమినల్ కేసుల్లో ఉన్నా వారిని కాపాడుకుంటూ వెనకేసుకువస్తున్నారని ఆరోపించారు. తన గొప్పతనాన్ని చాటుకునేందుకే దిశా కేసులో ఎన్కౌంటర్ చేయించారని అన్నారు డీకే అరుణ.

కేఎంసీ ఆసుపత్రిలో సీసీ కెమెరాలు పనిచేయలేదు అంటే నేరాన్ని తప్పించుకునేందుకు ఎలాంటి పగడ్భందీగా ప్లాన్ చేసారో అర్థం చేసుకోవాలన్నారు. మొదటి క్యాబినెట్ లో మహిళలు లేరని… రెండో క్యాబినెట్ లో రాష్ట్రంలో చర్చ జరుగుతోంది అని ఇద్దరికి చోటిచ్చాడన్నారు. ఆడపిల్లలను చదువుకునేందుకు హాస్టల్ లకు పంపాలన్నా తల్లిదండ్రులు భయపడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా నేరాలు జరుగుతున్నాయన్నారు.

మరోసారి అధికారంలోకి రావాలనే ఆలోచన తప్పితే మహిళలపై జరుగుతున్న దారుణాలపై కెసిఆర్ ఆలోచన చేస్తున్నాడా? అని ప్రశ్నించారు. కార్పోరేట్ విద్యాసంస్థల్లో ఒత్తిడికి గురై విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్న యాజమాన్యాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ప్రీతి హత్య కేసులో ఎందుకు కేసీఆర్ స్పందించడం లేదని ప్రశ్నించారు. కెసిఆర్ ప్రీతి కేసును నీరుగాలిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news