ఎడిట్ నోట్: మళ్ళీ జగనే.!

అవును మళ్ళీ జగనే సీఎం అవుతున్నారు..వైసీపీ 2024లో గెలవబోతుంది. అధికారంలోకి వస్తుంది. ఇది వైసీపీ శ్రేణులకు ఉన్న ధీమా..ఎలాంటి పరిస్తితులు ఉన్నా..చంద్రబాబు, పవన్ కలిసొచ్చిన జగన్ వైపే జనం ఉంటారని వైసీపీ భావిస్తున్నారు. అందుకే వైసీపీ మళ్ళీ గెలవబోతుందని, మళ్ళీ జగనే సీఎం కాబోతున్నారని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. మరి వైసీపీ శ్రేణులు అనుకున్నట్లుగా వైసీపీ మళ్ళీ గెలిచి అధికారంలోకి వస్తుందా? అంటే ఇప్పుడున్న పరిస్తితుల్లో వైసీపీ వైపే ప్రజలు ఉన్నారు.

అయితే ఇక్కడ వైసీపీ అనడం కంటే జగన్ అనడం బెటర్ ఎందుకంటే..జగన్‌నే జనం చూస్తున్నారు. జగన్ అంటే బ్రాండ్ గా మారిపోయింది. వాస్తవానికి వైసీపీలో పలువురు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. వారికి మళ్ళీ సీట్లు ఇస్తే గెలవడం కష్టమనే పరిస్తితి. ఆ విషయం జగన్ కు కూడా తెలుసు. అందుకే కొందరిని మార్చడానికి జగన్ సిద్ధమవుతున్నారు. సరే ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఎవరు బరిలో ఉన్న జనం మాత్రం ఓటు వేసేది జగన్‌ని చూసే..ఆయన అమలు చేసే పథకాలు..వైసీపీకి శ్రీరామరక్షగా ఉన్నాయి.

పైగా జగన్ ఇప్పుడు జనంలోనే ఉంటున్నారు. నిత్యం ఏదొక కార్యక్రమం పేరుతో ఆయన భారీ సభల్లో పాల్గొంటున్నారు. ఇక కేవలం పథకాలు మాత్రమే అమలు చేస్తున్నారు..అభివృద్ధి పట్టించుకోవడం లేదని విమర్శలు చేసేవారికి కూడా చెక్ పెడుతూ..జగన్ పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేస్తున్నారు. ఇటీవల విశాఖలో భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంఖుస్థాపన, కడప స్టీల్ ప్లాంట్..తాజాగా బందరు పోర్టుకు శంఖుస్థాపన చేశారు.

ఇలా సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళుతున్న జగన్‌కు జనం మద్ధతు బాగానే ఉంది. ఇప్పటికీ ఏమి ఆయన బలం తగ్గలేదు. ఇక చంద్రబాబు, పవన్ కలిసిన జగన్‌ని ఓడించలేరనే ధీమా వైసీపీ లో ఉంది. ఇక జగన్ సింగిల్ గా ఎన్నికలకు వెళ్ళడం కూడా కలిసొచ్చేలా ఉంది. మొత్తానికి 2024లో మళ్ళీ గెలిచి జగన్ సీఎం అవ్వడం ఖాయమని వైసీపీ శ్రేణులు ట్రెండ్ చేస్తున్నాయి.