ముంబయిలో రూ.1,400 కోట్ల మ్యావ్‌ మ్యావ్‌ డ్రగ్‌ స్వాధీనం

-

భారత్​లో మాదకద్రవ్యాల సరఫరాను కట్టడి చేసేందుకు అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా.. రోజూ ఎక్కడో చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాన నగరాలైన దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్​లలో డ్రగ్స్ ఎక్కువగా పట్టుబడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

తాజాగా.. దేశ వాణిజ్య రాజధాని ముంబయి సమీపంలో భారీ స్థాయిలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లా నాలాసొపారా ప్రాంతంలో ఓ డ్రగ్‌ తయారీ కేంద్రంపై దాడి చేసిన ముంబయి మాదకద్రవ్యాల నిరోధక విభాగం పోలీసులు 700 కిలోలకు పైగా నిషేధిత మెఫెడ్రోన్‌ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1,400కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది.

మెఫెడ్రోన్‌ను మ్యావ్‌ మ్యావ్‌ డ్రగ్‌ అని కూడా పిలుస్తారు. ఈ వ్యవహారంలో అయిదుగురిని అరెస్టు చేశారు. వారిలో ఒక మహిళ ఉన్నారు. ఆర్గానిక్‌ కెమిస్ట్రీ పట్టభద్రుడైన 52 ఏళ్ల ప్రధాన నిందితుడు రసాయన ప్రయోగాలు చేసి ఈ మాదకద్రవ్య తయారీ ఫార్ములాను కనుగొన్నాడని పోలీసులు చెప్పారు. ఓ సరఫరాదారును ఈ ఏడాది మార్చిలో అరెస్టు చేసిన తర్వాత ఈ వ్యవహారం గురించి తెలిసిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news