కేరళను వణికిస్తున్న వరదలు.. భారీగా ప్రాణనష్టం..

కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలతో వరదలు వణికిస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వానలతో ఇప్పటి వరకు 18 మంది
మృతి చెందారు. 8 జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఈ నెల 8 తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు అధికారులు. పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ్, కన్నూర్ జిల్లాల్లో కురుస్తున్న ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. వరదలతో కారణంగా రోడ్లు కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని, జనజీవనం స్తంభించిపోయి జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని అధికారులు అంటున్నారు. కొండ చరియలు విరిగిపడడం తో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. ముందస్తు జాగ్రత్తగా పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు.

Damage to Western Ghats makes Kerala floods worse | Mint

రాష్ట్రంలోని ప్రధాన ఆనకట్టలైన పొన్ముడి, లోయర్ పెరియార్, కల్లార్‌కుట్టి, ఇడుక్కిలోని ఎరట్టయార్, పతనంతిట్ట జిల్లాలోని మూజియార్ తో సహా అన్ని ప్రధాన ఆనకట్టలు నిండుకుండల్లా మారాయని అధికారులు పేర్కొన్నారు. వరద ముప్పు గ్రామాలలో ప్రజలను రక్షించి సహాయ శిబిరాలకు తరలించారు. గల్లంతయిన వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర రాజధాని తిరువనంతపురం మినహా మిగతా అన్ని జిల్లాలకు కేరళ ప్రభుత్వం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చాలక్కుడి, పంపా, మణిమాల, అచ్చంకోవిల్ వంటి నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. త్రిస్సూర్, ఎర్నాకులం జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం పినరయి విజయన్ కోరారు.