నిర్దాక్షణ్యంగా పలు టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి.ఆర్ధిక మాంద్యం కారణంగా తమ ఉద్యోగుల కోత పెడుతున్నాయ. తాజాగా లేఆఫ్స్ కంపెనీల జాబితాలోకి జూమ్ సంస్థ చేరింది. తమ కంపెనీలో 15 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు ఎరిక్ యువాన్ వెల్లడించారు. కొవిడ్ సమయంలో భారీగా సేవలు అందించాల్సిన కారణంగా పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకున్నామని..ఇప్పుడు ఆర్థిక భారం తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగించక తప్పని పరిస్థితి నెలకొందని అన్నారు సీఈవో ఎరిక్ యువాన్.
గతంలో ఐటీ డిమాండ్ కారణంగా జులై 2019 నుంచి అక్టోబర్ 2022 మధ్యలో జూమ్ సంస్థ 272 శాతం ఎక్కువగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవడం జరిగింది. అంటే దాదాపు 8,422 మందిని ఉద్యోగంలో చేర్చుకుంది. ఇలా చెయ్యడంతో కంపెనీపై భారం పడిందని..దిద్దుబాటు చర్యలు భాగంగా ప్రస్తుతం 1300 మంది ఉద్యోగులను తీసివేస్తున్నట్లు ఎరిక్ యువాన్ వెల్లడించారు. అమెరికాలోని తమ సంస్థ ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని చేరవేయనున్నట్లు యువాన్ చెప్పారు. అరగంటలో ఇంపాక్టడ్ అని మెయిల్ వస్తుందన్నారు. అమెరికా బయట ఉన్న ఉద్యోగులకు స్థానిక విధానాలను బట్టి సమాచారం అందచేస్తామన్నారు . అయితే అమెరికాలో ఉద్యోగం కోల్పోనున్న జూమీలకు 16 నెలల జీతం ఇవ్వనున్నట్లు యువాన్ తెలియపరిచారు . అలాగే హెల్త్‌కేర్ కవరేజ్ కూడా ఉంటుందన్నారు. 2023 ఏడాదికి చెందిన బోనస్ కూడా ఇస్తామన్నారు. ఇతర దేశాల్లో స్థానిక చట్టాలను బట్టి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ జరుగుతుంది అని చెప్పారు.