లీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం

-

సంగారెడ్డి జిల్లా జిన్నారంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గడ్డిపోతారం ఇండస్ట్రీ ఏరియాలోని లీ ఫార్మా కంపెనీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు రావడంతో వెంటనే కార్మికులు, ఉద్యోగులు భయంతో కంపెనీ నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలియగానే ఫైర్ ఇంజిన్లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పివేస్తున్నారు.

గత నెల 8న హైదరాబాద్ శివారు సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిన్నారం మండలంకు చెందిన గడ్డపోతారం మైలాన్ పరిశ్రమంలో మంటలు చెలరేగడంతో ముగ్గురు ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వచ్చి .. మంటలను అదుపుచేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే పరిశ్రమకు చెందిన గోదాములో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. తర్వాత అంతటా వ్యాపించాయి. ఇక, మృతులను రంజిత్ కుమార్,లోకేశ్వర్‌రావు, పరితోష్‌ మెహతా గా గుర్తించారు.

ఇక మృతి చెందిన వారిలో ఒకరు పశ్చిమ బెంగాల్ కి చెందిన వ్యక్తి కాగా మరొకరు బీహార్ కి చెందినవారు. ఇక అసిస్టెంట్ మేనేజర్ మాత్రం ఏపీలోని శ్రీకాకుళంకు చెందిన వ్యక్తని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్కు చెందిన పరితోష్‌ మెహతా (40), బిహార్‌ వాసి రంజిత్‌ కుమార్‌ (27) తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించగా మార్గం మధ్యలో ప్రాణాలు కోల్పోయారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news