టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పనిపాటాలేని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణలు తిప్పికొడతాం అన్నారు. గుడివాడ 22 వ వార్డు లో ప్రారంభమైన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కొడాలి నాని పాల్గొని ప్రసంగించారు. పవన్ కళ్యాణ్ చెప్పే తీరులో ఎటువంటి లాజిక్ లేదన్నారు నాని. వైసీపీ ప్రభుత్వానికి ఎటువంటి వ్యతిరేక ఓటు లేదని తెలిపారు.
మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి ఒక్క దాన్ని అమలు చేసినా, తమకు అనుకూల ఓటు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ప్రజలు ఇతర అవసరాలు తెలుసుకునేందుకే గడప గడపకు మన ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి పోటీ చేసిన విడివిడిగా పోటీ చేసిన తమకు ఉండేది ఏమీ లేదన్నారు. మా 151 సీట్లు పక్కాగా తిరిగి వస్తాయి అంటూ కొడాలి నాని వ్యక్తం చేశారు. మిగిలిన ఇరవై నాలుగు సీట్ల కోసమే ప్రతిపక్షాలు పోరాడాలని తెలిపారు కొడాలి నాని.