నంబి నారాయణ్‌లా చంద్రబాబును అరెస్ట్ చేశారు : రామ్మోహన్‌ నాయుడు

-

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌ను ఆ పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్ సభలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబినారాయణ్ అక్రమ కేసులను ఉటంకించారు. గురువారం లోక్ సభలో ఆయన మాట్లాడుతూ… నంబి నారాయణ్‌ను తప్పుడు కేసులతో ఎలా అయితే నిర్బంధించారో తమ పార్టీ అధినేతను కూడా అలాగే అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఎంతోమంది యువనాయకులకు స్ఫూర్తినిచ్చిన చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తప్పుడు కేసులు పెట్టారన్నారు. రూ.43వేల కోట్లను దోచుకున్న నాయకుడు బెయిల్ పైన వచ్చి పదేళ్లయినందుకు కొంతమంది సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు.

Ram Mohan Naidu: యువతను నిలబెట్టి గెలుస్తాం.. అధికారంలోకి వస్తాం -రామ్మోహన్  నాయుడు | Ram Mohan Naidu Kinjarapu Fires On Kodali Nani in Gudivada

అంతకుముందు సెప్టెంబర్ 18న కూడా చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ-వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. ఈ విషయంలో వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే అన్ని ఆధారాలతోనే తాము అరెస్ట్ చేశామని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఐటీ శాఖ చంద్రబాబుకు పీఏకు నోటీసులు ఇచ్చిందని.. ఆయన పరారీలో వున్నారని మిథున్ వ్యాఖ్యానించారు. 80 షెల్ కంపెనీలకు డబ్బు వెళ్లిందని ఈడీ తేల్చిందన్నారు. ఇది పూర్తిగా అవినీతి కేసు అని ఆయన పేర్కొన్నారు. ఇన్నాళ్లు చంద్రబాబు స్టేలతో తప్పించుకున్నారని మిథున్ రెడ్డి ఆరోపించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news