రోజురోజుకీ టెక్నాలజీ లో చాలా మార్పు వస్తోంది. గతంలో చూసుకున్నట్లయితే అంత పెద్దగా టెక్నాలజీ లేదు. కానీ రాను రాను అభివృద్ధి చెందుతోంది. నిజంగా అలా టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్న వాళ్ళని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. వాళ్ళు చేసిన సేవలని చెప్పుకోవాలి. ఐతె ఈ ఏడాది టెక్ రంగంలో విశిష్ట సేవలు చేసిన దిగ్గజాలు కొందరు కన్నుమూసారు. ఇది నిజంగా బాధాకరం. అయితే మరి మనం 2021లో కోల్పోయిన ఆ టెక్ దిగ్గజాల గురించి ఇప్పుడు చూద్దాం.
నిన్‌టెండ్:
ప్రపంచవ్యాప్తంగా వీడియో గేమ్‌లకు ఊపు తెచ్చారు నిన్‌టెండ్. ఈయన జపాన్‌కు చెందినగేమింగ్ ఇంజినీర్. ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్, సూపర్ నిన్‌టెండో ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్‌లో ఫేమస్ అయ్యారు. యమౌచీ కోరిక మేరకు క్యాట్రిడ్జ్‌లలో సైతం గేమ్‌లు ఆడేలా వీడియో గేమింగ్ వ్యవస్థను డిజైన్ చేయడం జరిగింది. ఈ డిసెంబర్‌లోనే 78 ఏళ్ల వయసులో ఈయన మరణించారు.
సర్ క్లయివ్ సిన్‌క్లెయిర్:
కంప్యూటర్‌ల వాడకానికి మూలకారకుడు ఈయన. జీఎక్స్(ZX) స్పెక్ట్రమ్ కంప్యూటర్ సృష్టికర్త ఈయన. దీనిని ఫస్ట్ పర్సనల్ కంప్యూటర్ అని అంటారు. కంప్యూటర్ వీడియో గేమ్‌లు, కోడింగ్ లాంటి విషయాల్ని ఇదే దగ్గర చేసింది. 2021 సెప్టెంబర్‌లో 81 ఏళ్ల వయసులో ఈయన అనారోగ్యం కారణంగా కన్నుమూశారు.
లొయు ఒటెన్స్:
క్యాసెట్ టేప్ తయారు చేసిన మహా మేధావి ఈయన. ప్రొడక్ట్ ఇంజినీర్‌గా కూడ పని చేసారు. పిలిప్స్ కంపెనీ నుంచి పోర్టబుల్ టేప్ రికార్డ్ మార్కెట్‌లోకి ఈయన వల్లనే విడుదలయ్యింది. ఈ ఏడాది మార్చ్‌లో ఆయన నెదర్లాండ్స్‌లోని అనారోగ్యం కారణంగా మరణించారు.
ఛార్లెస్ మాథ్యూ గెస్చ్‌క్లె:
టెక్ దిగ్గజం జాన్ వార్నోక్‌తో కలిసి ఈయన అడోబ్‌ను స్థాపించాడు. పోర్టబుల్ డాక్యుమెంట్ ఫైండర్ (PDF) సహ రూపకర్త కూడా ఈయన. ఛార్లెస్ మాథ్యూ గెస్చ్‌క్లె ఈ ఏడాది ఏప్రిల్‌లో 81 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
జాన్ మెక్‌అఫీ:
ప్రపంచంలోనే మొట్టమొదటి కమర్షియల్ యాంటీ వైరస్‌ను ఈయన రూపొందించారు. రాసలీలలు, డ్రగ్స్, తుపాకులు.. విలాసవంతమైన జీవితానికి కేరాఫ్‌గా నిలిచారు. ఆఖరికి ఈయన ఈ ఏడాది ఆత్మహత్యకు పాల్పడ్డాడు.