గణపతికి పత్రి అంటే ఎందుకంత ప్రీతి ?

-

ఏ దేవుడికి లేని విశిష్టమైన అంశాలు గణనాథుడికి కన్పిస్తాయి. ఆయన ఆహార్యాం నుంచి ఆహారం వరకు అన్ని ప్రత్యేకతలే. ప్రధానంగా ఆయన పూజలో ఉపయోగించే రకరకాల పత్రి ఎందుకు ఆయనకు ఇష్టమో తెలుసుకుందాం…

21 Types of Patri used in Ganesha Chaturthi

వినాయకుడి జన్మరాశి అయిన కన్యారాశికి అధిపతి బుధగ్రహం. ఈయన ఆకుపచ్చగా ఉంటాడు కాబట్టి, వినాయకునికి పత్రిపూజ ఇష్టమని చెప్పవచ్చు. ఆయన ఆది నుంచి ప్రకృతి ప్రియుడు. గడ్డిజాతి మొక్కల ద్వారానే ఆయనకు అనలాసురుడి బాధ నుంచి ఉపశమనం లభించింది. అందుకే ఆయనకు గరిక అంటే ఇష్టం. అంతేకాదండోయ్ ఆయన భక్త సులభుడు అనే పేరు కూడా ఉంది. భక్తులు ఎక్కువగా ఖర్చు చేయకుండా తమ ఇండ్ల చుట్టూ ఉండే సాధరణమైన ఆకులు, అలములు, గరికను పెడితే సంతోష పడుతాడు. మరో శాస్త్రీయమైన అంశం భాద్రపదమాసం అంటే వర్షరుతువు.

ఈ మాసంలో ఇండ్ల చుట్టూ చాలారకాల చెట్టు చామలు పెరిగిపోతాయి. వాటిలో మన ఆరోగ్యానికి ఉపయోగపడేవి తెచ్చి పెట్టడం అదే సమయంలో ఇతర పిచ్చి మొక్కలను నిర్మూలించడం వల్ల మనకు అంటువ్యాధులు ముఖ్యంగా దోమల నుంచి వచ్చే జ్వరాలు రాకుండా ఉండేదుకు పెద్దలు ఈ ఆచారాన్ని ఏర్పాటు చేశారని మరో వాదన ఉంది. ఏది ఏమైతేనేమి వినాయకుడి పూజలో వాడే పత్రిని స్వయంగా తెచ్చి పెడితే ఆయనకు మరింత ఇష్టమట.

 

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news