పదవ తరగతి అర్హతతో రైల్వేలో 2972 ఉద్యోగాలు.. ఇలా సులభంగా దరఖాస్తు చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఈస్ట్రన్‌ రైల్వే అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 2972 పోస్టులను భర్తీ చేయనున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 11 నుంచి మొదలు అయ్యింది.

Indian-Railways
Indian-Railways

ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 10, 2022. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. హౌరా డివిజన్ – 659 పోస్టులు, లిలుహ్ డివిజన్ – 612 పోస్టులు, సీల్దా డివిజన్ – 297 పోస్టులు, కంచరపర డివిజన్ – 187 పోస్టులు, మాల్డా డివిజన్ – 138 పోస్టులు, అసన్సోల్ డివిజన్ – 412 పోస్టులు, జమాల్‌పూర్ డివిజన్ – 667 పోస్టులు వున్నాయి.

ఇక అర్హతల వివరాలని చూస్తే… ఈ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. లేదు అంటే గుర్తింపు పొందిన బోర్డు నుంచి మొత్తంగా కనీసం 50 శాతం మార్కులతో సమానమైన పరీక్ష పాసై ఉండాలి. అదే విధంగా NCVT/SCVT జారీ చేసిన నిర్దేశిత ట్రేడ్‌లో జాతీయ TED సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

వయస్సు వివరాల లోకి వెళితే.. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే అభ్యర్థుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. అప్లికేషన్ ఫీజు గురించి చూస్తే.. అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాలి. SC/ST/PWBD/మహిళా అభ్యర్థులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పోస్టులకి సంబంధించి పూర్తి వివరాలని https://er.indianrailways.gov.in/ లో అప్లై చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version