చార్మినార్ వద్ద 500 నోట్ల వర్షం..ఎగబడ్డ జనం..వీడియో..

-

హైదరాబాద్ చార్మినార్ వద్ద ఓ వ్యక్తి 500 రుపాయల నోట్లను గాల్లోకి విసురుతూ కనిపించాడు..ఇందుకు సంభందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది..నగరంలోని గుల్జార్ హౌజ్ రోడ్డులో కార్లు, ఇతర వాహనాలపై వెళ్తున్న వారు ఈ దృశ్యాన్ని చూసి షాకయ్యారు. సదరు వీడియోలో కుర్తా, పైజామా ధరించిన ఓ వ్యక్తి గుల్జార్ హౌస్ ఫాంటెన్ వద్ద నిలబడి రూ.500 నోట్ల కట్టలను గాలిలోకి విసిరివేస్తున్నాడు. ఈ వీడియో అనేక సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది. అయితే తన బంధువుల వివాహ వేడుకల్లో భాగంగానే సదరు వ్యక్తి రూ.500 నోట్లను గాలిలోకి విసిరినట్లుగా పలువురు భావిస్తున్నారు.

ఈ ఘటన జరిగి మూడు రోజులు అయ్యింది.. సమయంలో కార్లు, మోటారు సైకిళ్లపై జనాన్ని సదరు వీడియోలో చూడవచ్చు. వీరిలో ఒక వ్యక్తి కారు దిగి నోట్లను గాల్లోకి విసిరేశాడు. గుల్జార్ హౌజ్ ఫౌంటెన్ పైకి ఎక్కుతూ, దిగుతూ పలుమార్లు అతను గాల్లోకి నోట్లు విసిరాడు. దీనిని చూసిన స్థానికులు నోట్లు సేకరించేందుకు ఎగబడగా..కొందరు మాత్రం అతను చేస్తున్న పనిని వీడియో తీస్తున్నారు.

అయితే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు ఆ వ్యక్తి చేసిన పనిపై మండిపడ్డారు. కొందరు ఈ వీడియో వాస్తవికతతో పాటు గాలిలోకి విసరబడ్డ నోట్లు అసలైన కరెన్సీనేనా అని అనుమానించారు. దీనిపై చార్మినార్ ఏరియా ఇన్స్‌పెక్టర్ బీ.గురునాయుడు మాట్లాడుతూ.. తాము ఈ వీడియోను సోషల్ మీడియాలో చూసినట్లు తెలిపారు..ఈ వీడియోకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు..ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.అతను ఎందుకు ఇలా చేశాడు అనే విషయం పై ఇంకా స్పష్టత రాలేదు..

https://youtube.com/shorts/IfDfAsDNx4A?feature=share

 

Read more RELATED
Recommended to you

Latest news