కేంద్రం నుండి సూపర్ స్కీమ్.. వృద్ధాప్యంలో నెలకు రూ. 5,000 పెన్షన్‌…!

-

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటోంది. వృద్ధాప్యంలో ఆర్థిక అండ లేకపోతే మనుగడ సాధించడం ఎంతో కష్టం. అందుకని ప్రభుత్వాలు కూడా వృద్ధాప్య పింఛన్‌ ని ఇస్తున్నాయి. అసంఘటిత రంగం లోని కార్మికులకు వయసు మళ్లిన తర్వాత సమస్యలు ఏమి కూడా కలగకూడదని కేంద్ర ప్రభుత్వ ఓ పథకం ద్వారా పింఛన్‌ ని ఇస్తోంది.

ఈ స్కీము లో కనుక ఇన్వెస్ట్ చేస్తూ వెళితే వృద్ధాప్యంలో ఆర్థికంగా ఇబ్బందులు ఏమి వుండవు. ఈ స్కీమ్ పేరు వచ్చేసి అటల్‌ పెన్షన్‌ యోజన. ఇక ఈ పథకం కి సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. 2015, మే 9న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ స్కీమ్ ని స్టార్ట్ చేసారు. నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ ని ఈ స్కీమ్ ద్వారా పొందవచ్చు. ఈ స్కీము కి ఆదాయ పన్నులు చెల్లించే వ్యక్తులు అర్హులు కారు. ఇప్పటి వరకు ఈ స్కీము లో 5 కోట్ల మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నారు.

వృద్ధాప్యంలో పెన్షన్‌ ని పొందొచ్చు. వయస్సును బట్టి పెట్టే పెట్టుబడిలో మార్పు అనేది ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ పెట్టుబడి కూడా పెరుగుతుంది. 18 సంవత్సరాల వయస్సులో ఏపీవై పథకంలో పెడితే పదవీ విరమణ తర్వాత నెలకు రూ. 5000 పెన్షన్ కావాలంటే 60 ఏళ్లు వచ్చే వరకు ప్రతి నెలా రూ. 210 పెట్టుబడి పెట్టాలి. వ్యవధికి నెలకు రూ. 168 మాత్రమే డిపాజిట్ చేస్తే ప్రతి నెలా రూ.4,000 విత్‌డ్రా చేసుకునేందుకు అవుతుంది. నెలకు రూ.3,000 పింఛను ని పొందాలి అనుకుంటే రూ.126 డిపాజిట్ చేయాలి.

రూ.84 చొప్పున డిపాజిట్ చేస్తే వారికి రూ.1,000 పెన్షన్ ఉంటుంది. నలభై ఏళ్ళ వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే నెలకు రూ. 5,000 పెన్షన్ పొందవచ్చు. 60 ఏళ్లు వచ్చే వరకు నెలకు రూ.1,454 పెట్టుబడి పెట్టాలి. నెలకు రూ. 4,000 పెన్షన్‌ కావాలంటే పెట్టుబడి మొత్తం రూ.1,164 పెట్టాల్సి వుంది. రూ. 3,000 పెన్షన్‌ కావాలంటే కేవలం రూ. 873. 1,000 కోసం రూ. 582 పెట్టాలి.

Read more RELATED
Recommended to you

Latest news