హోంగార్డును బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు.. క్రెడిట్ కార్డు నుండి 50 వేలు మాయం

-

సైబర్ నేరాలు ఆగడంలేదు.. రోజూ పదుల సంఖ్యలో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. బాధితుల్లో ఎక్కువగా చదువుకున్న వారే ఉండటం గమనార్హం. సామాన్య ప్రజలనే కాకుండా ఏకంగా ఓ పోలీసునే బురిడీ కొట్టించారు సైబర్ నేరగాళ్లు.కామారెడ్డి జిల్లా లో క్రెడిట్ కార్డ్ బ్లాక్ అయిందంటూ హోంగార్డ్ ను బురిడీ కొట్టించారు సైబర్ నేరగాళ్లు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప నగర్ కాలనీకి చెందిన హోంగార్డ్ లింబాద్రి కి రెండు రోజుల క్రితం సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్ కాల్ వచ్చింది.

క్రెడిట్ కార్డ్ బ్లాక్ అయిందంటూ, రెన్యువల్ చేయాలంటూ ఓటిపి పంపారు సైబర్ నేరగాళ్లు.సైబర్ నేరగాళ్ల మాట నమ్మి మొబైల్ కు వచ్చిన ఓటీపీని తెలిపాడు హోంగార్డు లింబాద్రి. ఇంకేముంది క్రెడిట్ కార్డ్ నుంచి 50,824 నగదు డెబిట్ అయినట్లు మొబైల్ కు మెసేజ్ వచ్చింది. దీంతో ఖంగుతిన్న హోంగార్డు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న కామారెడ్డి పట్టణ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news