ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ వ్యక్తి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. అతడికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు పొట్టలో అనుమానాస్పదంగా ఏదో కనిపించడం గమనించారు. వెంటనే ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసేటప్పుడు అతడి పొట్టలో 63 స్పూన్లను గమనించారు. శస్త్రచికిత్స చేసి వాటిని బయటకు తీశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
మన్సూరాపుర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బోపాడా గ్రామానికి చెందిన విజయ్ అనే వ్యక్తి మత్తు పదార్థాలకు బానిసయ్యాడు. ఆ అలవాటును మాన్పించేందుకు కుటుంబసభ్యులు అతడిని షామ్‌లీలోని డ్రగ్ డీఅడిక్షన్ సెంటర్‌లో చేర్పించారు. అక్కడ విజయ్‌కు అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించింది. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ముజఫర్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతడికి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ చేసిన వైద్యులు అతడి కడుపులో నుంచి 63 స్పూన్లు బయటకు తీశారు.
ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. డ్రగ్ డీఅడిక్షన్ సెంటర్ సిబ్బందే విజయ్‌తో బలవంతంగా చెంచాలను మింగించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.