ఎల్‌ఐసీ పాలసీతో రూ.76 లక్షలు…లోన్ కూడా వస్తుంది..!

-

దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీల్లో ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొన్ని రకాల పాలసీలని ఇస్తోంది. ఎల్ఐసీ అందిస్తున్న వాటిల్లో బీమా రత్న పాలసీ కూడా ఒకటి.
బీమా రత్న పాలసీ తో చక్కటి లాభాలని పొందేందుకు అవుతుంది. ఎల్ఐసీ బీమా రత్న పాలసీతో అదిరే ప్రయోజనాలని పొందొచ్చు.

ఇక ఎల్ఐసీ బీమా రత్న పాలసీ కి సంబంధించి పూర్తి వివరాలని చూసేద్దాం. ఇందులో డబ్బులు పెడితే మెచ్యూరిటీ సమయంలో ఏకంగా రూ. 76 లక్షలు దాకా వస్తాయి. ఇది నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ఇండివీజువల్ ఇన్సూరెన్స్ ప్లాన్. అంటే మనీ బ్యాక్ పాలసీలాగ. కచ్చితమైన బోనస్ కూడా వస్తుంది. కనీసం రూ. 5 లక్షల మొత్తంతో దీన్ని తీసుకోవాలి. గరిష్ట పరిమితి ఏమి ఉండదు.

55 ఏళ్ల వరకు వయసు వారు దీన్ని తీసుకోవచ్చు. ప్రీమియం మొత్తాన్ని నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున పే చేసేయచ్చు. 15 ఏళ్లు, 20 ఏళ్లు, 25ఏళ్లు టెన్యూర్‌తో ఈ పాలసీ ని తీసేయచ్చు. నచ్చిన టెన్యూర్ ని ఎంపిక చేసేయచ్చు. 15 ఏళ్ల టెన్యూర్ ని ఎంపిక చేసుకుంటే 11 ఏళ్లు కట్టాలి. 20 ఏళ్ల టెన్యూర్ అయితే 16 ఏళ్లు ప్రీమియం కట్టాలి. 25 ఏళ్లు టెన్యూర్ ని ఎంపిక చేసుకుంటే 21 ఏళ్లు ప్రీమియం కట్టాలి.

25 ఏళ్ల పాలసీ టెన్యూర్ కి 21 ఏళ్ల వరకు ప్రీమియం పే చెయ్యాలి. ఏడాదికి దాదాపు రూ. 1.18 లక్షల ప్రీమియం పే చెయ్యాలి. 23వ సంవత్సరం, 24వ సంవత్సరం లో చేతికి రూ. 5 లక్షల వస్తాయి. అంటే రూ. 10 లక్షలు వస్తాయి. సర్‌వైవల్ బెనిఫిట్ కింద వస్తుంది ఇది. గ్యారంటీ అడిషన్స్ కింద చేతికి రూ. 28.5 లక్షలు వస్తాయి. అలానే మెచ్యూరిటీ బెనిఫిట్ కింద రూ. 38.5 లక్షలు పొందొచ్చు. ఆ వ్యక్తి కనుక మరణిస్తే నామినీకి కరూ. 53 లక్షలు వస్తాయి. లోన్ ఫెసిలిటీ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news