మార్చి 31 తర్వాత… ఈ 9 స్కీములు ఉండవు…!

-

చాలా మంది భవిష్యత్తు అవసరాలని దృష్టి లో పెట్టుకుని డబ్బులని దాచుకోవాలని చూస్తూ వుంటారు. మీరు కూడా అలానే మీ డబ్బులని దేనిలో అయినా పెడుతూ వుంటారా..? అయితే ఇది మీరు తప్పక చూడాలి. వచ్చే నెల నుంచి ఈ 9 స్కీమ్స్ అందుబాటులో ఉండవు. ఇక మరి వీటి కోసం పూర్తి వివరాలని చూస్తే.. కొన్ని బ్యాంకులు కస్టమర్లకు ప్రత్యేకమైన ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలను ఇస్తున్నాయి. వీటి వలన మనం ఎన్నో లాభాలని పొందుతూ ఉంటాము. మార్చి 31 తర్వాత కొన్ని బ్యాంకులు అందిస్తున్న ఎఫ్‌డీ స్కీమ్స్ అందుబాటులో ఉండవని బ్యాంకులు అంటున్నాయి.

banks
banks

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 400 రోజుల టెన్యూర్‌ తో ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్ ని అందిస్తోంది. అమృత్ కలశ్ ఎఫ్‌డీ స్కీమ్ ఇది. ఏకంగా 7.6 శాతం వరకు వడ్డీ ని ఇస్తోంది. ఈ పథకం మార్చి 31 వరకే అందుబాటులో వుంది. ఆ తరవాత ఉండదు. దీనిలో చేరితే సీనియర్ సిటిజన్స్‌కు అదనంగా 30 బేసిస్ పాయింట్లు వస్తుంది.

అలానే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్‌డీ పేరు తో ఈ స్కీమ్ ని తీసుకు వచ్చారు. 2020 మే 18 నుంచి ఈ స్కీమ్ అందుబాటులో ఉంది. వచ్చే నెల నుంచి ఈ స్కీమ్ ఉండదు. ఈ స్కీమ్ లో చేరిన వారికి 0.5 శాతం ఎక్కువ వడ్డీ కాకుండా, అదనంగా 0.25 శాతం అధిక వడ్డీ పొందొచ్చు. ఇండియన్ బ్యాంక్ కూడా ఎఫ్‌డీ స్కీమ్ అందుబాటులో ఉంచింది. ఇండ్ శక్తి 555 డేస్ ఎఫ్‌డీ స్కీమ్ ఇది. దీని మీద 7.5 శాతం వడ్డీ వస్తుంది. దీనిలో ఎంతైనా రూ.2 కోట్ల వరకు పెట్టుకోవచ్చు.

ఐడీబీఐ బ్యాంక్ కూడా స్పెషల్ స్కీమ్ ని ఇస్తుంది. దీని పేరు నామన్ సీనియర్ సిటిజన్ డిపాజిట్. ఈ స్కీమ్ ఈ నెలతో ముగిసి పోతుంది. పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ కూడా పీఎస్‌బీ ఫ్యాబులస్ 300 డేస్, పీఎస్‌బీ ఫ్యాబులస్ ప్లస్ 601 డేస్, పీఎస్‌బీ ఇఅడ్వాంటేజ్ ఫిక్స్‌డ్ డిపాజిట్, పీఎస్‌బీ ఉత్కర్ష్ 222 డేస్ మార్చి 31 వరకే అందుబాటులో ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news