భర్త లేని టైమ్‌లో కిరాణ షాపులో ప్రియుడితో శృంగారం !

-

మహారాష్ట్రలోని బి.వై.నగర్ కాలనీకి చెందిన ప్రవీణ్, లహరి అనే దంపతులు ఉంటున్నారు. వీరికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక అమ్మాయి. వయసు మూడు సంవత్సరాలు. ప్రవీణ్ పని చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. కొన్ని రోజులకు ప్రవీణ్ కి యాక్సిడెంట్ అవ్వటంతో ఇంట్లోనే ఉండిపోయాడు. ఆర్టిక ఇబ్బందుల వల్ల లహరి కూలి పని చేసేది.

డబ్బులు దాచుకొని ఒక కిరాణా షాప్ పెట్టారు. కిరాణా షాపులో వీరికి బాగానే లాభం వచ్చింది. కొన్ని రోజులకు ప్రవీణ్ కూడా ఒక కంపెనీలో జాబ్ చూసుకున్నాడు. అదే కంపెనీలో పనిచేసే శ్రీను అని వ్యక్తి అప్పుడప్పుడు లహరి వాళ్ళ షాప్ కి వచ్చేవాడు. శ్రీను అనే వ్యక్తితో లహరికి పరిచయం ఏర్పడింది. ఇంకేముంది ఒకరికి ఒకరు ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. రోజులో గంటల తరబడి ఫోన్లో మునిగి తేలిపోయేవారు. ప్రవీణ్ లేని సమయంలో శ్రీను షాప్ లోకి వచ్చి కూర్చునే వాడు.

కొన్ని రోజులకి వీరి చనువు కాస్త ప్రేమగా మారి ఆ ప్రేమ అక్రమ సంబంధానికి దారితీసింది. ఇక వీరి సంబంధాన్ని షాపులోనే కొనసాగించేవారు. ఈ క్రమంలోనే లహరి గర్భం దాల్చింది. దీంతో అనుమానం వచ్చిన ప్రవీణ్ అందరూ చెప్పే మాటలు నిజమేనేమో అనుకోని వీరిపై కన్నేసి ఉంచాడు. ఒకరోజు వీరిద్దరూ షాప్ లో చనువుగా మాట్లాడుకుంటూ ఉండగా ప్రవీణ్ సడన్ గా వచ్చి వీరిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. దీంతో వీరి అక్రమ సంబంధం బయటపడింది.

Read more RELATED
Recommended to you

Latest news