అంపైర్ల కోసం A+ కేటగిరీ.. బీసీసీఐ కీలక నిర్ణయం

-

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అంపైర్ల కోసం A+ కేటగిరీని ప్రవేశపెట్టింది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ సభ్యుడు నితిన్ మీనమ్‌తోపాటు మరో నలుగురు ఇంటర్నేషనల్ అంపైర్లును ఈ విభాగంలో చేర్చారు. మాజీ ఇంటర్నేషనల్ అంపైర్లు సుధీర్ అనానీ, కే.హరిహరన్, అమీష్ సాహేబా, కమిటీ సభ్యుల నిర్ణయం మేరకు అపెక్స్ కౌన్సిల్ A+ కేటగిరీని తీసుకొచ్చింది. A+ కేటగిరీలోని అంపైర్లకు రోజుకు రూ.40 వేలు చెల్లించనున్నారు.

బీసీసీఐ
బీసీసీఐ

B, C కేటగిరీలోని అంపైర్లకు రూ.30 వేలు చెల్లించనున్నారు. సి.షంషుద్దీన్‌తోపాటు మరో 20 మంది అంపైర్లు A గ్రూపులో ఉండనున్నారు. అలాగే B గ్రూపులో 60 మంది, C గ్రూపులో 46 మంది అంపైర్లు ఉండనున్నారు. కాగా, కరోనా కారణంగా 2018 నుంచి బీసీసీఐ అంపైర్ల జాబితాను తయారు చేయలేదు. ఎలైట్ ప్యానెల్‌లో ఏకైక భారతీయ అంపైర్‌గా నితిన్ మీనన్ కొనసాగుతున్నారు. అంపైర్లల్లో క్వాలిటీ, ఫోకస్ పెంచేందుకు బీసీసీఐ కేటగిరీలను ప్రవేశపెట్టినట్లు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news