బ్రేకింగ్ : మేడారం గోవింద రాజుల పూజారి దారుణ హత్య

-

తెలంగాణ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. మేడారం గోవింద రాజుల పూజారి దారుణ హత్యకు గురయ్యాడు. ములుగు జిల్లా మేడారం గోవింద రాజుల పూజారి దబగట్ల రవి(45) దారుణ హత్యకు గురయ్యాడు.

 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బండరాళ్లతో మేడారం గోవింద రాజుల పూజారి దబగట్ల రవి తలపై కొట్టి హత్య చేశారు గుర్తు నిందితులు.

 

నిన్న సాయంత్రం ఘటన జరిగినట్టు భావిస్తున్నారు స్థానికులు. ఈ రోజు ఉదయం వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. ఇక సంఘటన స్థలం చేరుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు. కొండాయి గ్రామానికి చెందిన రవి గోవింద రాజుల ఆలయ పూజారిగా వ్యవహరిస్తాడు.హత్య కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news