Nithin : “మాచర్ల నియోజకవర్గం” నితిన్ ఫస్ట్ లుక్ కు ముహుర్తం ఫిక్స్

-

టాలీవుడ్ హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు హీరో నితిన్. ప్రస్తుతం హీరో నితిన్‌ “మాచర్ల నియోజకవర్గం” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ను శేఖర్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కృతి శెట్టి నటిస్తుండగా.. శ్రేష్ఠ్ మూవీస్ పతాకం పై తెరకెక్కుతోంది.

“మాచర్ల నియోజకవర్గం” సినిమాకు మహతి స్వరసాగర్‌ సంగీతం అందిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి హీరో నితిన్‌ ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అప్డేట్‌ ఇచ్చింది.

ఈ నెల 26 వ తేదీన అంటే ఎల్లుండి.. ఈ సినిమా నుంచి నితిన్‌ ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా విడుదల చేసింది చిత్ర బృందం. “నితిన్ ఫస్ట్‌ ఛార్జీ మార్చి 26 వ తేదీన రాబోతుంది” అంటూ చిత్ర బృందం ట్వీట్‌ చేసింది. దీంతో ఈ సినిమాలో నితిన్‌ ది ఎలాంటి క్యారెక్టర్‌ చేయబోతున్నాడని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

 

Read more RELATED
Recommended to you

Latest news