అసలు ఏంటీ హంటా వైరస్

-

ప్రపంచమంతా నేడు కరోనా వైరస్ ఎఫెక్ట్ తో వణికిపోతోంది. అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ, పలు న్యూస్ ఛానెల్స్ లోనూ హంటా వైరస్ గురించి బాగా వినిపిస్తోంది. అసలు ఏంటీ హంటా వైరస్, అలాంటి వైరస్ ఉందా? లేదా? ఉంటే దాని ప్రభావం ఏంటి? ఎంతటి ప్రమాదం అనే విషయంపై చాలా మంది నిజనిర్దారణలు చేస్తున్నారు?

అసలు ఈ న్యూస్ ఎక్కడ నుంచి పుట్టిందంటే. చైనాలోని షాన్డాండ్ ప్రావిన్స్ లో ఈ వైరస్ పుట్టినట్లు వార్తలు వినిపించాయి. షాన్డాంగ్ ప్రావిన్స్ నుంచి యునాన్స్ ప్రావిన్స్ కి వచ్చిన ఓ వ్యక్తిలో ఈ లక్షణాలు కనిపించాయి. అయితే ఆ వ్యక్తితో పాటు బస్సులో ప్రయాణించిన 32 మందికి హంటా వైరస్ సోకిందని గ్లోబల్ టైమ్స్ అనే పత్రిక ప్రచురించింది. దీంతో హంటా వైరస్ పై సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ క్రియేట్ అయ్యాయి.

అయితే కొన్ని పరిశోధనలు నిర్వహించిన తర్వాత ఆ వార్త ఫేక్ అని తేలింది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం హంటా వైరస్ అనే ప్రాణాంతక మైనదే కానీ అది కరోనా వైరస్ లా మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందదు. అది ఎలుక నుంచి మాత్రమే మనిషికి వ్యాప్తి చెందుతుంది. ఈ హంటా వైరస్ సోకిన వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తారని తేల్చింది. దీంతో ఇన్నాళ్లూ హంటా వైరస్ సోకుతుందని వచ్చిన వార్తలన్నీ అవాస్తవం అని తేలింది.

దీంతో ప్రస్తుతం గ్లోబల్ టైమ్స్ ప్రచురించిన ఆ వార్త పై పలువురు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రజలను భయాందోళనలకు గురిచేసే ఇలాంటి వార్తలను ఎలా ప్రచురిస్తారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news