పిటిషన్ వేసినందుకు కేజ్రీవాల్ కి లక్ష రూపాయలు ఫైన్

-

సీఎం బాధ్యతల నిర్వహణ కోసం కేజీవాల్ జైలులో ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించాలని పిటిషన్ వేసినందుకు ఢిల్లీ హై కోర్టు రూ.లక్ష ఫైన్ వేసింది. జైలులో సీఎం కార్యాలయ నిర్వహణ సాధ్యం కాదంటూ ఆ పిటిషన్ను కొట్టేసింది. శ్రీకాంత్ ప్రసాద్ అనే అడ్వకేట్ ఈ పిటిషన్ వేశారు.

తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ మరియు జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరాలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్‌ను విచారించింది, ఈ సందర్భంగా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది. మేం ఎమర్జెన్సీ విధించాలా? మార్షల్‌ చట్టాన్ని అమలుచేయాలా? రాజకీయ ప్రత్యర్థులు చేసుకునే వ్యాఖ్యలను ప్రసారం చేయకుండా మేం మీడియాపై సెన్సార్‌షిప్‌ ఎలా విధించగలం? అని ప్రశ్నించింది. కాగా, ఢిల్లీ లిక్కుర్ స్కామ్ కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేసింది ఈడీ. ప్రస్తుత జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలులో ఉన్నారు. ఇక ఈ కేసులో కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తే.. ముఖ్యమంత్రి బాధ్యతల్లో అధికారిక విధులు నిర్వర్తించేందుకు అనుమతించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version