BREAKING : సామాన్యులకు షాక్‌..భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

-

రోజు రోజుకి గ్యాస్ సిలిండర్ ధరలు బాగా పెరిగిపోతున్నాయి. మనం ఈ సంవత్సరం జనవరి నుండి చూసుకున్నట్టయితే గ్యాస్ సిలిండర్ ధర మొత్తం రూ.200 పైగా పెరిగింది.  అయితే.. తాజాగా వినియోగదారులకు చమురు కంపెనీలు మరోసారి దిమ్మదిరిగే షాక్ ఇచ్చాయి.

గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 50 రూపాయలు పెంచేశాయి చమురు కంపెనీలు. తాజాగా పెరిగిన ధరలతో గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 1052 రూపాయలకు చేరింది. పెరిగిన ధరలు ఇప్పటికే అమలు లోకి వచ్చాయి. పెట్రోల్ మరియు డీజిల్ ధరల పెంపుతో ఇప్పటికే ఇబ్బందిపడుతున్న ప్రజలకు పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర మరింత భారం కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version