‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ నుంచి సోల్ సాంగ్

యంగ్ హీరో అఖిల్ అక్కినేని మరియు పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న రొమాంటిక్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా… జి ఏ 2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాసు మరియు వాసువర్మ సంయుక్తంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అల్లు అరవింద్ గారి గీత ఆర్ట్స్ సమర్పణలో తెరకెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ… ఇటీవలే u/a సర్టిఫికెట్ కూడా సంపాదించింది.

అంతేకాదు ఇటీవల ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించింది చిత్రబృందం. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దసరా కానుకగా… అక్టోబర్ 15వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. సినిమా విడుదలకు మరో నాలుగు రోజులు ఉండగానే… ఈ సినిమా నుంచి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో సోలో సాంగ్ ను విడుదల చేసింది చిత్రబృందం. ” చిట్టి అడుగు” పేరు తో ప్రారంభమయ్యే ఈ సాంగ్… అందరినీ ఆకట్టుకుంటోంది. సమాజానికి మెసేజ్ ఇచ్చే తరహాలో ఈ పాట పూర్తిగా సాగుతోంది. విడుదలైన కాసేపటికే యూట్యూబ్ ను షేక్ చేసేస్తుంది ఈ పాట.