గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించాలంటే ఆషామాషీ కాదు..ఎవ్వరూ చేయలేనిది, ఎప్పుడూ చూడలేనిది చేస్తే తప్ప ఊరికి అంతటి పేరు రాదు. తాజాగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కోడుతుంది…ఓ సూపర్ మార్కెట్ యాజమాన్యం అరుదైన రికార్డు లను సొంతం చేసుకుంది.అమెరికాలోని షికాగోకు చెందిన జ్యూవెల్ – ఓస్కో సూపర్ మార్కెట్ స్టోర్ నిర్వాహకులు సరికొత్త రికార్డును సృష్టించారు. వెస్ట్‌మాంట్ గ్రామంలో బనానా బొనాంజా పేరుతో నిర్వహించిన ప్రదర్శనలో సుమారు 31,751 కిలోలు(70,000 పౌండ్ల) అరటిపండ్లను ఉపయోగించి గిన్నీస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కారు.
పండ్ల ఉత్పత్తిదారు ఫ్రెష్ డెల్ మోంటే, సూపర్ మార్కెట్ చైన్ జ్యువెల్-ఓస్కో ఈ ఘనతను సాధించారు. గిన్నిస్ టైటిల్‌ను పొందే ప్రయత్నంలో జ్యువెల్-ఓస్కో యొక్క స్టోర్ లలో ఒకదాని బయట పెద్ద అరటి పండ్ల స్టాండ్ ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. దీనిలో సుమారు మూడు లక్షల అరటిపండ్లను ఒకదాని పక్కన మరొకటి పేర్చారు..దీని కోసం మూడు రోజులు కష్ట పడ్డారు..గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కు చెందిన అధికారులు ఈ ప్రదర్శనను తిలకించి ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ప్రదర్శనగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ల్లోకి ఎక్కించారు. ఇందుకు సంబంధించి అధికారిక దృవపత్రాన్ని నిర్వాహకులకు అందజేశారు. అరటి పండ్ల ప్రదర్శన చిత్రాలు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్‌ను వెస్ట్‌మాంట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టూరిజం బ్యూరో వారు అధికారిక ఫేస్‌బుక్ పేజీ ద్వారా విడుదల చేశారు.
కాగా, ఇంత పెద్ద మొత్తంలో ఉన్న అరటిపండ్లను ప్రదర్శనను తిలకించేందుకు వచ్చిన వారికి అందజేశారు. మిగిలిన అరటి పండ్లను చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు అందజేశారు.2016 లో వివిధ రకాల పండ్ల తో బ్రెజిలియన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైవ్‌స్టాక్ నిర్వహించింది.16 రకాల పండ్లను వాడారు.ఇప్పుడు వీళ్ళు కేవలం అరటి పండ్లతో ఈ రికార్డును బ్రేక్ చేశారు.ఇందుకు సంభందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
The folks from @GWR have surveyed the display and it’s official! We have a new WORLD RECORD!
Our roving banana reporter Leslie Harris is LIVE at the @jewelosco in Westmont (@westmontilgov) with the latest fruit-related news!#Westmont #Bananas #LotsofBanans #WorldRecord pic.twitter.com/n5Qobn13YA
— 95.9 The River (@959TheRiver) June 8, 2022