ఇలాంటి భోజనమా పెట్టేది.. కన్నీరు పెట్టుకున్న కానిస్టేబుల్‌

-

ఎండనక, వాననక పోలీసులు విధి నిర్వాహణలో ఉంటూనే ఉంటారు. అయితే..అయితే.. అలాంటి పోలీసులకు నాణ్యమైన తిండిపెట్టడం లేదంటూ ఓ కానిస్టేబుల్‌ కన్నీటి పర్యంతమయ్యాడు. రోజుకు 12 గంటలు కష్టపడి డ్యూటీ చేస్తున్న తమకు ఇలాంటి భోజనం పెడతారా? అని కన్నీళ్లు పెట్టుకున్న కానిస్టేబుల్‌పై ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో జరిగిందీ ఘటన. కోర్టు వద్ద భద్రతా విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ మనోజ్ కుమార్ బుధవారం భోజనం ప్లేటుతో రోడ్డుపైకి వచ్చి తన బాధను పంచుకున్నాడు.

Constable Crying: చేతిలో ప్లేట్ పట్టుకుని ఏడ్చిన కానిస్టేబుల్.. కారణం ఏంటంటే..? - NTV Telugu

రోజుకు 12 గంటలు కష్టపడి డ్యూటీ చేస్తున్న తమకు ఇలాంటి భోజనం పెడతారా? అంటూ తమకు అందించిన రొట్టెలు, ఇతర పదార్థాలను చూపిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఫిరోజాబాద్‌లోని మెస్‌లో అందించే భోజనం ఏమాత్రం బాగుండడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కానిస్టేబుళ్లకు పోషకాహారం కోసం రూ. 1,875 ఇస్తామన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హామీ ఏమైందని ప్రశ్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. క్రమశిక్షణ రాహిత్యం, విధులకు గైర్హాజరు సహా మనోజ్‌పై మొత్తం 15 కేసులు పెండింగులో ఉన్నాయన్న సీనియర్ ఎస్పీ ఆశిష్ తివారీ దర్యాప్తునకు ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news