ఈనాడు రామోజీరావుకు చెందిన రామోజీ ఫిలిం సిటీకి అరుదైన గౌరవం లభించింది. కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రత మరియు ప్రమాణాల సంస్థ అత్యుత్తమ రేటింగ్ కింద ఫిలిం సిటీని ఇట్ రైట్ క్యాంపస్ గా ధ్రువీకరించింది. ఫిలిం సిటీని సందర్శించే పర్యాటకులకు జాతీయ ఆరోగ్య విధాన ప్రమాణాలకు లోబడి సురక్షిత, పరిశుభ్రమైన అలాగే పోషకాలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నట్లు పేర్కొంది.
దాదాపు 1660 ఎకరాలలో విస్తరించిన రామోజీ ఫిలిం సిటీలో 15 రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిలో త్రీ స్టార్ మరియు ఫైవ్ స్టార్ కేటగిరి హోటల్లు ఉన్నాయి. ఇవన్నీ ఎఫ్ ఎస్ ఎస్ ఏ ఐ నిర్వహించే కఠినమైన ఆడిటింగ్ ప్రక్రియలో పాల్గొన్నాయి. ప్రమాణాలను పూర్తిస్థాయిలో పాటించడంతో ఇట్ రైట్ క్యాంపస్ గా ఫిలిం సిటీ గుర్తింపు సాధించింది. స్టార్ హోటళ్లకు, ఫైవ్ స్టార్ కేటగిరీలో పరిశుభ్రత మరియు పారిశుద్ధ్య ధ్రువీకరణ లభించింది.