కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ఏ ఒక్కరికీ సాధారణ జీవితం దొరకట్లేదు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఏదో భయం, అనుమానం ఉంటూనే ఉన్నాయి. పెద్దలు ఈ విధంగా భయపడుతూ పిల్లలను ఇంట్లోనే ఉంచుతున్నారు. దాంతో పిల్లలకు ఆటలు లేకుండా పోయాయి. మైదానం ముఖం చూడని విద్యార్థులు చాలామంది ఉన్నారు. ఐతే ఈ పరిస్థితిని తొందరగా పోవాలని కర్నూలు జిల్లా విద్యార్థులు వినాయకుడికి వినతిపత్రాన్ని అందజేసారు. అవును, మీరు వింటున్నది నిజమే, కర్నూలు జిల్లాలోని సోమప్పనగర్ లోని పాఠశాల విద్యార్థులు వినాయకుడుకు పూజలు చేసి, వినతిపత్రాన్ని అందజేసారు.
మహమ్మారి తొందరగా అంతమైపోవాలని, మళ్ళీ స్కూళ్ళు, కాలేజీలు తెరుచుకోవాలనీ, వీధుల్లో ఆడుకునే అవకాశం తొందరగా లభించాలని వినాయకుడుని వేడుకున్నారు. ఇదిలా ఉంటే అదే ఊర్లోని మహిళలు, వంటగ్యాస్ ధరలు తగ్గాలని, కరెంటు ఛార్జీలు తగ్గాలని, ఈ మేరకు ప్రభుత్వం మేలుకోవాలని వినాయకుడికి పూజలు చేసారు.