వాట్ ఎ ఐడియా బాసూ..పైసా ఖర్చు లేకుండా..అదిరిపోలే..

-

మన దేశంలో కొత్త కొత్త ఆలోచనలకు కొదవ లేదు..ఎన్నో అద్భుతాలను మన వాళ్ళు పరిచయం చేస్తూనే వున్నారు.ఇప్పటికే ఎన్నో కొత్త వాటిని ఆవిష్కరిస్తూ పాపులర్ అవుతున్నారు.అంతేకాదు ‘ దేశీ జుగాడ్ ‘ లతో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నారు కూడా.. ప్రస్తుతం, సోషల్ మీడియాలో అలాంటి ఒక వీడియో ప్రజల దృష్టిని ఆకర్షించింది. ‘జుగాడ్ టెక్నాలజీ’ని ఉపయోగించి తయారు చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను ప్రజలు.. తమ బంధువులు, స్నేహితులకు షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.

ఇక విషయానికొస్తే..రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్‌కు యువతలో ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ బుల్లెట్‌ పట్ల అన్ని వయసుల వారిలోనూ క్రేజ్ ఉంది. అయితే దీని ధర, బైక్ ప్రియులు కొనుగోలు చేసే విషయంలో చేతులు కట్టేస్తోంది. అయితే మనలో ప్రతిభ ఉంటే అభిరుచిని, ఇష్టాన్ని నెరవేర్చుకోకుండా ఎవరూ ఆపలేరు.. అందుకు సాక్ష్యంగా ఇప్పుడు ఓ అబ్బాయి సైకిల్‌ను బుల్లెట్ బైక్‌గా మార్చిన ఈ  లుక్ వేసుకోండి…

తన సైకిల్‌ను బుల్లెట్ బైక్‌గా మార్చి చక్కర్లు కొడుతున్నాడు. ఈ ఫోటోలు చూస్తుంటే యువకుడు బుల్లెట్ బైక్ నడుపుతున్నట్లు అనిపించినా అతను దగ్గరికి వచ్చేసరికి అసలు విషయం తెలుస్తుంది. ఎందుకంటే అది బుల్లెట్ లా కనిపించేలా సైకిల్ అని తెలిసేది. ఆ యువకుడు రోడ్డుపై బుల్లెట్ సైకిల్ ను నడుపుతున్నప్పుడు.. ప్రజలు దానిని చూసి ఆశ్చర్యపోయారు.. దీన్ని చూసిన వారంతా కూడా ఔరా అంటూ ఒకింత షాక్ ఇస్తున్న దాన్ని తెగ ఫోటోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అది కాస్త వైరల్ అవుతుంది..సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల కే వైరల్ అయ్యింది..మీరు కొత్త బైకు పై లుక్ వేసుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news