ఒకరి తరువాత మరొకడు మహిళపై సామూహిక అత్యాచారం.. తరువాత

కామాంధులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ఎన్ని కఠిన శిక్షలు వేసినా కామాంధుల వెన్నులో మాత్రం వణుకు పుట్టడం లేదు. ఓ మ‌హిళ‌పై సామూహిక అత్యాచార‌నికి పాల్ప‌డి ఆమెను రోడ్డు ప‌క్క‌న న‌గ్నంగా ప‌డ‌వేసిన దారుణ ఉదంతం మ‌హారాష్ట్ర‌లోని బంధ‌ర జిల్లాలో క‌ల‌క‌లం రేపింది. ఈ కేసులో ఇద్ద‌రు నిందితుల‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ప‌రారీలో ఉన్న మ‌రో నిందితుడి కోసం గాలిస్తున్నారు. మ‌హిళ (35)వివస్త్ర‌గా బ్రిడ్జి వ‌ద్ద ప‌డిఉన్న‌ద‌నే స‌మాచారంతో పోలీసులు ఘ‌ట‌నా స్ధ‌లానికి చేరుకున్నారు. మ‌హిళ‌ను స్దానిక ఆస్ప‌త్రికి తీసుకువెళ్ల‌గా వైద్యుల సూచ‌న‌తో మెరుగైన చికిత్స నిమిత్తం నాగ‌పూర్ మెడిక‌ల్ కాలేజ్‌కు త‌ర‌లించారు. మ‌హిళ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశామ‌ని క‌ర్ధ ఎస్ఐ రాజేష్ థొర‌ట్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం బాధితురాలు గోరేగావ్ త‌హిసిల్‌లోని క‌మ‌ర‌గావ్‌లో నివ‌సించే సోద‌రుడి వ‌ద్ద‌కు జులై 30న వెళుతుండ‌గా ఈ దారుణం జ‌రిగింది.

A Group Of Men Gang Raped A Minor Girl In Front Of Her Parents

మ‌హిళ‌ను త‌న సోద‌రుడి ఇంటికి తీసుకువెళ‌తాన‌ని న‌మ్మ‌బ‌లికిన నిందితుడు శ్రీరాం ఉర్కుడె ఆమెను ప‌ల‌స్‌గావ్‌కు తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్ప‌డి జాతీయ ర‌హ‌దారి వెంబ‌డి అట‌వీ ప్రాంతం వ‌ద్ద వ‌దిలేశాడు. ఆగ‌స్ట్  1న బాధితురాలు బంధ‌ర జిల్లా క‌న్హ‌ల్మోహ్ చేరుకోగా మ‌రో నిందితుడు లుక్కా అశోక్ స‌ర్వే ఆమెకు మాయ‌మాట‌లు చెప్పి లైంగిక దాడి చేశాడు. అశోక్‌కు నేరం చేయ‌డంలో మ‌రో నిందితుడు మ‌హ్మ‌ద్ ఇజాజ్ అన్సారీ స‌హ‌క‌రించాడు. అశోక్‌, అన్సారీల‌ను అరెస్ట్ చేసిన పోలీసులు మ‌రో నిందితుడు ఉర్కుడె కోసం గాలిస్తున్నారు. ఈ కేసును గోరేగావ్ పోలీసుల‌కు బ‌ద‌లాయించ‌గా త‌దుప‌రి ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేశారు.