ఈ డబ్బులు పొందడానికి కూడా ఆధార్ అవసరం..!

-

మనకి వుండే డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు చాలా ముఖ్యమైనది అని అందరికీ తెలిసినదే. అయితే
మరో దానికి ఆధార్ అథంటికేషన్‌ను తప్పనిసరి చేసింది కేంద్రం. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో దానికి ఆధార్ అథంటికేషన్‌ను తప్పనిసరి చేసింది. జీఎస్‌టీ కట్టే వారు కచ్చితంగా వారి ఆధార్‌ను ధ్రువీకరించుకోవాలి అని అంది.

లేదు అంటే జీఎస్‌టీ రిఫండ్స్‌ డబ్బులు రావు అని స్పష్టంగా తెలిపింది. ఈ విషయాన్నీ స్వయంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ CBIC వెల్లడించింది. ఇది ఇలా ఉంటే జీఎస్‌టీ చెల్లింపుదారుల ఆధార్ అథంటికేషన్ కోసం సీబీఐసీ జీఎస్‌టీ నిబంధనలలో మార్పు చేసారు. జీఎస్‌టీ రిఫండ్ డబ్బులను నేరుగా బ్యాంక్ అకౌంట్‌కే ట్రాన్స్‌ఫర్ చేయడం సహా ఎగవేత చర్యలను అడ్డుకునేందుకు కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకు వచ్చింది.

మాములుగా వ్యాపారులు ఆధార్ ఇవ్వక పోయినా ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తారు. కానీ ఇక నుండి అయితే జీఎస్‌టీ రిఫండ్ పొందాలంటే మాత్రం జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ను బయోమెట్రిక్ ఆధార్‌ తో లింక్ తప్పక చేసుకోవాలి అని తెలిపింది. ఒకవేళ కనుక లేదు అంటే అప్పుడు జీఎస్‌టీ రిఫండ్ డబ్బులు పొందడం అవ్వదు అని గమనించండి. ఈ కొత్త రూల్ 2022 జనవరి 1 నుంచి కొత్త రూల్ అమలులోకి రానుంది. ఈ కొత్త రూల్ ని జీఎస్టీ చెల్లించే వారు మరచిపోకండి.

Read more RELATED
Recommended to you

Latest news