అమిత్ షాతో కేసీఆర్ భేటీ.. రెండు రోజుల్లో రెండుసార్లు.. ప్రతిపక్షాలు ఏమంటున్నాయి?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్ ఆసక్తి రేపుతుంది. రెండు రోజుల్లో వరుసగా రెండుసార్లు కేంద్ర మంత్రి అమిత్ షాతో కేసీఆర్ భేటి కావడం చర్చనీయాంశం అయ్యింది. ఈ వరుస భేటీల్లో కేసీఆర్, అమిత్ షాల మధ్య ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయన్న దానిపై పెద్ద చర్చలు జరుగుతున్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తీసుకునే చర్యలపై ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు కేసీఆర్ చెబుతున్నప్పటికీ, రాజకీయ అంశాలే ప్రధానంగా చర్చకు వచ్చి ఉంటాయని ప్రతిపక్షాలు మాట్లాడుకుంటున్నాయి.

తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, ప్రతిపక్షాల దూకుడు మొదలైనవి చర్చించి ఉంటారని మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే, కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో ధాన్యం కొనుగోళ్ల మీద చర్చ జరిగింది. తెలంగాణలో ఉన్న ధాన్యం మొత్తాన్ని కేంద్రం కొనాలని తెలియజేయగా, ఈ విషయంలో ఎలాంటి స్పష్టత కేంద్రం నుండి రాలేదని సమాచారం. మొత్తానికి కేసీఆర్ ఢిల్లీ పర్యటన అటు రాజకీయ వర్గాల్లోనే కాదు, ఇటు సామాన్యుల్లోనూ ఆసక్తి రేకెత్తించింది.